Moga molestation case: Mayawati demands investigation by higher authorities

Mother daughter jump off moving bus to escape molestation in punjab girl dies

molestation in Punjab, Molestation, Moga molestation, Punjab, nation, Crime, "Sukhbir Badal,Moga civil hospital, Girl,14, dies, mother seriously injured, victims thrown, moving bus, India, gang, passengers, conductor, sexually, assaulted, Mayawati, prakash singh badal, moga bus incident, girl thrown out of bus,

A 13-year-old girl died and her mother suffered serious injuries on Wednesday evening when the two jump off a moving bus in Punjab's Moga district to avoid being sexually assaulted by the conductor's assistant.

పంజాబ్ లో దారుణం.. సీఎం బస్సులో అత్యాచారయత్నం.. దూకిన తల్లికూతళ్లు

Posted: 04/30/2015 06:13 PM IST
Mother daughter jump off moving bus to escape molestation in punjab girl dies

పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మైనర్ బాలికపై బస్సులోని మగమృగాళ్లు అత్యాచారానికి యత్నించారు. పాశవిక మృగాళ్ల వేటకు చిక్కకుండా ఆ బాలిక ధీటుగా ఎదుర్కోంది. ఇక చేసేది లేక కదులుతున్న బస్సు నుంచి దూకింది. అ వేంటనే అమె తల్లి కూడా బస్సు నుంచి దూకింది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స పోందుతూ ధీర బాలిక కన్నుమూసింది. మోగా జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

దేశంలో పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా.. ఆడవారి తలరాతలు మాత్రం మారడం లేదు. ఆడపిల్లలు కనబడితే చాలు ఆటవస్తువులుగా భావిస్తున్న మగమృగాళ్ల పాశవిక చర్యలకు అడ్డు అదుపు వుండటం లేదు. పంజాబ్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి. మోగా జిల్లా నుంచి పది కిలోమీటర్ల దూరం వున్న గిల్ గ్రామంలోని తల్లికూతుళ్లు కొంత దూరంలో వున్న గురుద్వారాకు వెళ్లేందుకు ఓ ప్రైవేటు బస్సును ఆశ్రయించారు. అందులో అప్పటికే బస్సు డ్రైవర్, కండక్టర్ కు చెందిన మిత్రులుగా భావిస్తున్న పలువురు ప్రయాణిస్తున్నారు.

ఈ విషయంతో తెలియని తల్లికూతుళ్లు బస్సులోకి ఎక్కి ప్రయాణిస్తుండగా, 14 ఏళ్ల మైనర్ బాలికపై బస్సులోని దుండగులు అత్యాచారానికి యత్నించారు. వారిని తల్లికూతుళ్లు కొంత సేపు సమర్థవంతంగానే ఎదుర్కోన్నారు. బాలికపై మగమృగాళ్లు పైశాచికత్వం పెరగడంతో అ అమ్మాయి వారిని కోంత వరకు ధైర్యంగానే ఎదుర్కుని చివరి.. వారి బలం పెరగడంతో.. కదులుతున్న బస్సులోంచి దూకేసింది. ఇది గమనించిన తల్లి అమెను కాపాడేందుకు బిగ్గరగా కేకలు వేస్తూ బస్సు డోర్ వరకు రాగా, అమెను కూడా మగమృగాళ్లు కిందకు తోసాయి.

కదులుతున్న బస్సులోంచి బయటకు దూకిన తల్లి కూతుళ్లను చూసిన స్థానికులు వారిని మొగా సివిల్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పోందుతూ సాహసి బాలిక కన్నుమూయగా, బాలిక తల్లి మాత్రం తీవ్రం గాయాలబారిన పడి జీవన్మరణ పరిస్థితుల మద్య కోట్టుమిట్టాడుతుంది. అయితే తల్లి ఎదుటే కూతురిపై అత్యాచార యత్నానికి పాల్పడిన బస్సు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కుటింబికులకు చెందిన ఆర్బిట్ కంపెనీకి చెందినదేనని తేలింది. అయితే కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Molestation  Punjab  nation  Crime  

Other Articles