National | Strike | Road Transport | NDA | Bills

Nationwide strike against the new road transport bill today

National, Strike, Road Transport, Central govt, NDA, Modi, Bills

Normal life in the state may be affected today as public transport and auto rickshaws are likely to stay off the roads in support of a nation wide strike called by transport sector workers in protest against the proposed new road transport bill.

దేశవ్యాప్తంగా రవాణా బంద్.. కొత్త బిల్లుపై ఆగ్రహం

Posted: 04/30/2015 08:08 AM IST
Nationwide strike against the new road transport bill today

జాతీయ రోడ్డు రవాణ, భద్రత బిల్లు ప్రతిపాదనలను నిరసిస్తూ దేశవ్యాప్త రవాణా సమ్మె ప్రారంభమైంది. గత అర్ధరాత్రి నుండి సరుకు రవాణకు సంబంధించిన వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో గురువారం రవాణా మొత్తం స్తంభించింది రవాణ బిల్లును ఏఐటీయూసీ తిరోగమన ప్రజావ్యతిరేక చర్యగా అభివర్ణించింది. ఇది కేంద్రం రాష్ట్రాల అధికారాలను హరించడమేనని ఏఐటీయూసీ వ్యాఖ్యానించింది. జాతీయ స్థాయిలో వివిధ రవాణ సంస్థలు సంయుక్తంగా ఒకరోజు రవాణ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏఐటీయూసీ, సీఐటీయూ, బిఎంఎస్, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్ తదితర కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు పలుకుతున్నాయి. ఈ బిల్లు ద్వారా రోడ్డు రవాణాను కేంద్రం తన అదుపులోకి తీసుకోదలచిందని రవాణ సంస్థలు, కార్మిక సంఘాలు నిరసిస్తున్నాయి. ఇది ఫెడరలిజంపై జరుగుతన్న దాడిగా పేర్కొంటున్నాయి. పది లక్షల మందికి ఉపాధి చూపుతున్న 54 రాష్ట్రాల రవాణా సంస్థలను ఈ బిల్లు దెబ్బతీస్తుందని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లు వల్ల నష్టదాయకమైన రూట్లలో ప్రభుత్వ సంస్థలు సర్వీసులను నిర్వహించలేవని చెబుతున్నాయి.

మరోవైపు ఆర్టీసీలో ఎన్‌ఎంయూ మినహా అన్ని యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చాయి. వేతన సవరణ జరగకపోవడాన్ని నిరసిస్తూ 6 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నేటి రవాణ సమ్మెకు వారు సంఘీభావం మాత్రమే తెలుపుతున్నారు. దీంతో బస్సులు యథావిధిగానే తిరుగుతాయి. బస్సు డిపోల ముందు భోజన విరామ సమయంలో మాత్రమే కార్మికులు నిరసన వ్యక్తం చేస్తారని ఆయా సంఘాలు పేర్కొన్నాయి. ఆటోకార్మిక సంఘాలు కూడా సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. ఫలితంగా ఆటోలు కూడా అంతంత మాత్రంగానే తిరగనున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ పాటించాలన్న కార్మిక సంఘాల విజ్ఞప్తి పట్ల లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాల సంఘాలు సానుకూలంగా స్పందించాయి. దీంతో పాలు, మందులు లాంటి అత్యవసర సేవలందించే వాహనాలు మినహా మిగిలిన వాహనాలు నిలిచిపోనున్నాయి. ఇదిలావుండగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు బంద్‌లో పాల్గొనడం లేదని ప్రైవేటు ఆపరేటర్స్ అసోసియేషన్ తెలిపింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : National  Strike  Road Transport  Central govt  NDA  Modi  Bills  

Other Articles