Samrt | Cities | cabinet | Central govt | NDA

Hundred smart city projects get cabinet nod

Smart, Cities, cabinet, Central govt, NDA, Meeting, Modi, Venkiah naidu

The Union Cabinet cleared one of Prime Minister Narendra Modi’s most favoured projects — 100 smart cities spread across the country — and a new urban renewal mission named after Atal Bihari Vajpayee, replacing the existing one named after Jawaharlal Nehru, with a total outlay of nearly Rs. 1,00,000 crore.

ఇక సిటీలు స్మార్ట్.. స్మార్ట్.. కేంద్ర ప్రభుత్వం ఆమోదం

Posted: 04/30/2015 07:53 AM IST
Hundred smart city projects get cabinet nod

సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి పథకానికి, అలాగే పట్టణాల నవీకరణ కోసం చేపట్టిన కొత్త పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలవో తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం 48 వేల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా వంద స్మార్ట్‌సిటీల అభివృద్ధి కోసం చేపట్టిన స్మార్ట్‌సిటీల అభివృద్ధి మిషన్‌ను, అలాగే 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో 500 నగరాల అభివృద్ధి కోసం అమృత్ పేరుతో చేపట్టిన అటల్ మిషన్ ఫర్ రీ జువెనేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మిషన్‌కు ఆమోదం తెలియజేసింది. నగరాల రూపు రేఖలను మార్చివేసి వాటిని నివసించడానికి మరింత అనువైన నగరాలుగా తీర్చి దిద్దడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీల అభివృద్ధి పథకం కింద ఎంపిక చేసిన నగరానికి కేంద్రం అయిదేళ్ల పాటు ఏటా వంద కోట్ల రూపాయల సహాయం అందిస్తుంది. ఇక జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ మిషన్ పథకాన్ని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పేరుతో అమృత్ పథకంగా పేరు మార్చడం తెలిసిందే.

ఈ పరిపాలన, ప్రత్యేకంగా మున్సిపల్ కేడర్ ఏర్పాటు, నిధుల బదలాయింపు, భవన నిర్మాణ నిబంధనల సమీక్ష, పురపాలక పన్నుల మదింపు, వసూలును మెరుగుపర్చడం, ఇంధనం, నీటి వినియోగ గణన, పౌర కేంద్రిత పట్టణ ప్రణాళిక వంటి పట్టణ సంస్కరణలకు ఏఎంఆర్‌యూటీ కార్యక్రమం అమలుకు ముడి పెడతారు. గుర్తించిన నగరాల్లో అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది. పదిలక్షల వరకు జనగాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం సాయం 50శాతం వరకు ఉంటుంది. పదిలక్షలకు పైబడి జనభా ఉన్న నగరాల్లో ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతును కేంద్రం అందిస్తుంది. కేంద్ర సాయానికి అదనంగా రాష్ట్రాలు, పట్టణ సంస్థలు 50 నుంచి 66 శాతం వరకు మ్యాచింగ్ వనరులు సేకరించాల్సి ఉన్నందున వచ్చే ఐదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో కనీసం రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవహించనున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smart  Cities  cabinet  Central govt  NDA  Meeting  Modi  Venkiah naidu  

Other Articles