Telanagana | Hyderabad | KCR | International city | Swach Bharat

Telangana cm kcr review meeting on hyderabad development

Telanagana, Hyderabad, KCR, International city, Swach Bharat

Telangana cm kcr review meeting on hyderabad development. Telangana cm kcr consontrated on hyderabad development and infrstructure. KCR wish to discover hyderabad as international city.

హైదరాబాద్ కు కొత్త కళ: కేసిఆర్

Posted: 04/30/2015 07:45 AM IST
Telangana cm kcr review meeting on hyderabad development

తెలంగాణ ముఖ్యమంత్రి హైరాబాద్ నగర అభివృద్ది సహా పలు కార్యక్రమాలపై సమీక్షాసమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ను వెయ్యి కోట్లతో పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర గవర్నర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీనటులు, ప్రజల భాగస్వామ్యంతో 'స్వచ్ఛ హైదరాబాద్'ను ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తామని తెలిపారు. మే 16న గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, 20 వరకు భారీఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ నగరాన్ని 1.5 కిలోమీటర్ల పరిధితో 400 భాగాలుగా గుర్తించి, ఒక్కో భాగం బాధ్యతలను ఒకరి అప్పగిస్తారు. గవర్నర్, ముఖ్యమంత్రి, సీఎస్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వీటికి ఇన్‌ఛార్జులుగా ఉంటారు. ప్రతి భాగంలో 15 మంది స్థానికులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. మొత్తంగా స్వచ్ఛభారత్‌లో ఆరువేల మంది పాల్గొంటారు. వీరందరికీ మే 6న అవగాహన సదస్సు నిర్వహిస్తామని కేసిఆర్ అన్నారు.

హైదరాబాద్ నగరంలో ఇల్లులేని నిరుపేదలు రెండు లక్షల మందికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్నులు నివాసం ఉండేచోట ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని సిఎం ప్రకటించారు. నిరుపేదల ఇళ్లు అంటే ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కాకుండా నగరం నడిబొడ్డులో రెండు వేల ఎకరాల స్థలాన్ని సేకరించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది సిఎంగా తన లక్ష్యమన్నారు.  హైదరాబాద్‌లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రెండు లక్షలమంది నిరుపేదలకు ఇల్లులేదని తేలిందని, వారందరికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏ ఒక్క నిరుపేదా ఇల్లులేకుండా ఉండకూడదన్ననది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. ధనవంతుల విలాసాలు, వినోదాలు, కాలక్షేపాలు, ఇతర అలవాట్ల కోసం వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినప్పుడు నిలువ నీడలేని నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తే తప్పేంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagana  Hyderabad  KCR  International city  Swach Bharat  

Other Articles