Jayalalitha DA Case: SC Terms SPP's Appointment by TN Govt 'Bad in Law'

Supreme court strikes down bhavani singh s appointment

Jayalalithaa appeal, Bhavani Singh appointment, Supreme Court verdict, DMK leader Anbazhagan plea, Jayalalithaa DA case, crime, law and justice, corruption, bribery, justice and rights

The appointment was a manifestation of the government's "anxiety" about the future, says Bench

అవినీతి, లంచగొండితనం.. దీర్ఘకాలిక వ్యాధులని సుప్రీం వ్యాఖ్యలు

Posted: 04/28/2015 06:03 PM IST
Supreme court strikes down bhavani singh s appointment

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే పార్టీ అదినేత్రి జయలలిత ఆస్తుల కేసులో అప్పీలుపై విచారణకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిగా భవానీసింగ్ నియామకం చెల్లదని దేశ సర్వోన్నత సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పుచెప్పింది. ప్రభుత్వానికి హక్కు, అధికారం లేదని, చట్టప్రకారం ఇది మోసపూరితమైన చర్య అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం లేదని తోసిపుచ్చింది. భవానీసింగ్ నియామకం చెల్లనంత మాత్రాన జయ ఆస్తుల కేసును మళ్లీ విచారించాల్సిన అవసరం లేదని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. దేశంలో అవినీతి, లంచగొండితనం పెరిగిపోయి దీర్ఘకాలిక వ్యాధిగా మారిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీన్ని నిర్మూలించేలా తీర్పుచెప్పాలని సూచించింది.
 
అవినీతి రహిత సమాజాన్ని ఆశిస్తున్నట్లుగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. జయకు జైలు జీవితం ఖాయమనే ఊహాగానాలు బయలుదేరగా, ప్రతిపక్షాలు సంబరం చేసుకుంటున్నాయి. భవానీసింగ్‌పై తీర్పు నిజాయితీకి, న్యాయానికి కలిగిన విజయమని డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. నిందితులుగా నిర్ధారణ అయిన వారే తమకు అనుకూలమైన వ్యక్తిని ప్రభుత్వ న్యాయవాదిగా నియమించుకోవడం ఈ కేసు విచారణలో వినోదమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్ అన్నారు. అందుకే కోర్టు సరైన తీర్పును వెల్లడించిందని వ్యాఖ్యానించారు. జయ ఆస్తుల కేసుపై కర్ణాటక ప్రత్యేక కోర్టు గత ఏడాది సెప్టెంబరు 27వ తేదీన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles