Congress | Trs | Hyderabad | KCR | Bhattivikramarka | Uttamkumar | Telangana

Telangana congress leaders comented on trs party and its leaders

congress, trs, hyderabad, KCR, Bhattivikramarka, uttamkumar, telangana

Telangana congress leaders comented on TRS party and its leaders. TRS party planning to sell hyderabad congress leaders said.

హైదరాబాద్ ను అమ్మేస్తున్నారు.. ఎవరంటే ?

Posted: 04/27/2015 05:12 PM IST
Telangana congress leaders comented on trs party and its leaders

కాంగ్రెస్ నాయకులు పేలని టపాసుల్లా మారారు. పాపం వాళ్లు ఏం మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కనీసం పట్టుకోవడం లేదు. తాజాగా కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క టిఆర్ఎస్ పై విమర్శల వర్షం గుప్పించారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ అధికారంలో వచ్చిందంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ను అమ్మకానికి పెడుతోందని  భట్టి విక్రమార్క మండిపడ్డారు. సెక్రటేరియట్ను కూడా ప్రైవేట్ సంస్థలకు ధారదత్తం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. హైదరాబాద్ సిటీ, ప్రభుత్వ సంస్థలను రక్షించుకునే ఎజెండాతో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని భట్టి సూచించారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదుపై నేతలతో ఉత్తమ్, భట్టి, షబ్బీర్ అలీ సమావేశమైయ్యారు.

అధికారక టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు హిత బోధ చేశారు. 10 నెలల కేసీఆర్ సర్కార్ రాజకీయ వలసలను ప్రోత్సహించిందే కానీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన విమర్శించారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయికి చేరినా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉందని ఉత్తమ్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా, వికారుద్దీన్ ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరపకుండా ప్రభుత్వమే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావాలని కూడా అన్నారు. మైనార్టీల భాష్యం చెప్పుకునే ఎంఐఎం కూడా ఈ అంశాన్ని ప్రశ్నించడం లేదని ఉత్తమ్ విమర్శించారు. పార్టీలో విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యడానికి కాంగ్రెస్ కార్యకర్తలు పాటుపడాలని ఉత్తమ్ కుమార్ సూచించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  trs  hyderabad  KCR  Bhattivikramarka  uttamkumar  telangana  

Other Articles