Silver futures marginally down on weak global cues

Gold futures down on weak global cues

Gold futures down on weak global cues, Silver futures marginally down on weak global cues, Gold prices, Silver prices, futures trade, weak cues from global market, bullion market,

Gold prices were marginally down by 0.10 per cent to Rs 27,062 per 10 gm in futures trade on April 24 after participants offloaded partial positions, taking weak cues from global market

:ఫ్యూచర్ ట్రేడింగ్ లో తగ్గనున్న బంగారం ధరలు

Posted: 04/24/2015 09:01 PM IST
Gold futures down on weak global cues

అతి విలువైన లోహాల ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతోపాటు దేశీయంగా ఆభరణాలను కొనుగోలు చేయడానికి రిటైలర్లు వెనుకంజ వేయడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణమయ్యాయి. రానున్న రోజుల్లో పసిడి తన కాంతులను మరింతగా కోల్పోనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవాళ జరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్ ట్రేడింగ్ లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గనున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ల నుంచి బలహీనమై పవనాలు వీయడంతో బంగారం, వెండి ధరలకు కొంత మేరకు తగ్గనున్నాయి.

 10 గ్రాములు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారు 0.10 శాతం మేర ధరను కోల్పోయి 27 వేల 62 రూపాయలకు లభ్యం కానుంది.  ఆగస్టు మాసంలో జరగనున్న ట్రేడింగ్ లో ఈ మేరకు ధరలు వుండే అవకాశాలు వుండగా, సరాసరి రూపాయలు 28 మేర బంగారం ధరలు తగ్గనున్నాయి. అయితే జూన్ మాసానికి చ్చే సరికి 23 రూపాయల మేర తగ్గవచ్చు. అటు బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గనున్నాయి. పారిశ్రామిక రంగం, నాణేల తయారీదారుల నుండి డిమాండ్ పడిపోవడంతో ఫ్యూచర్ ట్రేడింగ్ లో కిలో వెండి ధర 0.07 శాతం మేర తగ్గి.. 36 వేల 85 రూపాయల వద్దకు చేరనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold prices  Silver prices  futures trade  weak cues from global market  

Other Articles