BSNL landline offers free pan-India calls from 9pm to 7am

Bsnl offers unlimited free calling at night from landline

BSNL offers unlimited free calling at night from landline, BSNL introduced unlimited free calling plan, Bharat Sanchar Nigam Ltd promotes landline usage, unlimited free night calling, 9 PM to 7 AM, BSNL, Free Calling, Free Hours, Unlimited calls, any network, india wide free calling, BSNL Free Calling plan, Unlimited Free Hours,

State-run BSNL said it will introduce unlimited free calling at night from its landline phones to all landline and mobile phones of all service providers across India from May 1.

బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ అదుర్స్.. పైకం చెల్లించకుండానే ఫ్రీ కాల్స్..!

Posted: 04/23/2015 04:17 PM IST
Bsnl offers unlimited free calling at night from landline

దేశంలోని అతి పెద్ద నెట్ వర్క్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ఆఫర్తో ముందుకు రాబోతుంది. ధేశవ్యాప్తంగా దృడమైన నెట్ వర్క్ వున్న ఏకైక సంస్థ.. ఇప్పుడు తన వ్యాపారాలను విస్తరింప జేసుకునేందుకు కొత్త పథకంలో కదనరంగంలోకి దిగనుంది. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే నైట్ కాలింగ్ ఆప్షన్ ను కస్టమర్లకు ఇచ్చి.. దాంతో పాటు బ్రాండ్ బాండ్ లింక్ చేసుకుని ముందుకు దూసుకెళ్లాలని పథకాన్ని వేసింది. ఇప్పటి వరకు పలు నెట్ వర్క్లు ఎంతోకొంత చెల్లించడంతో సెల్ ఫోన్ ద్వారా రాత్రి వేళలో నాన్ స్టాప్ గా  ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వగా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం అంతకంటే మించిన పథకాన్ని ప్రారంభించబోతుంది.

రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు.. ఎలాంటి అదనపు రుసుము లేకుండా, ఎలాంటి ఫ్యాకేజీలు లేకుండా.. పూర్తి ఉచితంగా ఏ నెట్ వర్క్ కు అయినా ఫోన్ కాల్ చేసి నిరంతరం మాట్లాడుకునే అవకాశాన్ని ఇవ్వనుంది. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకాన్ని మే 1 నుంచి ప్రారంభించనుంది.  అయితే, ఈ అవకాశం మాత్రం ల్యాండ్ ఫోన్ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇప్పటికే అన్ని రకాల ప్లాన్స్తో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ల్యాండ్ ఫోన్లు వాడే వారందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటనలో పేర్కోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : free calls  bsnl  may 1  all land lines  

Other Articles