Jagga Reddy’s Ghar Wapsi | digvijay singh | congress

Turpu jayaprakash reddy to join congress soon

Jagga Reddy’s Ghar Wapsi, turpu jayaprakash reddy to join congress soon, Former legislator, BJP, Bharatiya Janata Party, jagga reddy to return to his former party Congress, sangareddy, Telangana Rastra samithi, TRS Mla,

Former legislator Turupu Jayaprakash Reddy alias Jagga Reddy is in a fix over whether to stay in the BJP or return to his former party Congress. Though he reportedly made some moves to join the party,

బుల్లి పిట్ట, బుజ్జి పిట్ట.. గూటిలోని గువ్వ పిట్ట..

Posted: 04/23/2015 04:25 PM IST
Turpu jayaprakash reddy to join congress soon

బిల్లి పిట్ట, బుజ్జి పిట్ట.. గూటిలోని గువ్వ పిట్ట... పంజరాన రామచిలుక ఎట్టగున్నదో అంటూ విరహ గీతాలను పాడుకుంటూ.. ఏం చేయాలో తోచక.. మిగతా పార్టీలలో తన స్వేచ్చకు ముక్కుతాడు వేయడంతో.. తిరిగి తన గూటికి చేరుకుంటానంటానంటోంది ఈ రాజకీయ పిట్ట. సమాజంలో తన కంటూ మంచి పేరు వుంది.. రాజకీయంగా తనకు అవకాశామిచ్చిన టీఆర్ఎష్ పార్టీ అదినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మినహా.. అప్పటి ముఖ్యమంత్రి వైఎష్ రాజశేఖర్ రెడ్డి, కోణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల వరకు అందరినీ ఒప్పించి, మెప్పించిన రాజకీయ దురందరుఢిగా కూడా పేరుంది.

అయితే తనకు పదవిపైన వున్న వ్యామోహంతో ఎక్కడికైనా వెళ్తారు.. ఎవరితోనైనా తలపడతారన్న.. ఈ విషయంలో చివరకు తనకు రాజకీయంగా పైకి ఎదిగేందుకు దోహదపడిన పార్టీలకు వ్యతిరేకంగా కూడా పోటీ చేస్తారన్న అపఖ్యాతిని కూడా ముట్టగట్టుకున్నారు. రాజకీయ అవకాశ వాదిగా కూడా కొందరి నుండి విమర్శలను ఎదుర్కోన్నాడు. ఇంతకీ ఎవరా నాయకుడంటారా..? అయనే మెదక్‌ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి. ఇప్పుడాయను గురించి చర్చ ఎందుకని అంటారా..? ఆయన తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు కాబట్టి.

మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలపుడు ఆయన కాంగ్రెస్‌ను వీడి  బిజెపిలో చేరి ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలో టిఆర్‌ఎస్‌ గెలుపొందగా రెండో స్ధానంలో కాంగ్రెస్‌ నిలిచింది. దాంతో బిజెపిలో జగ్గారెడ్డికి ప్రాధాన్యత తగ్గింది. ఈ నేపథ్యంలో మెదక్‌ ఉపఎన్నిక కోసం బిజెపి తన ఇమేజ్‌ను వాడుకొని వదిలేసిందని వాపోతున్న జగ్గారెడ్డి  కొంత కాలంగా తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్‌ డిసిసి చీఫ్‌గా ఉన్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి అంగీకరించారని సమాచారం. ఈ నెల 29న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వస్తున్నందున అదే రోజు గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaggareddy  congress  bjp  sangareddy  trs  

Other Articles