Photographer Takes Amazing Shot Of Lion While Escaping Attack

Pakistani photo grapher takes photo of lion very closely

pakistani photo grapher takes photo of lion very closely, Photographer Takes Amazing Shot Of Lion While Escaping Attack, pakistani photographer Atif Saeed, Atif Saeed captured the breathtaking image of Lion, Lahore safari park in 2012, Atif Saeed photograph now gone viral.

In a near-death experience, a Pakistani photographer barely escaped with his life after capturing a spectacular picture of an attacking lion.

నెట్ లో హల్ చల్ చేస్తున్న మృగరాజు ఫోటో.. ప్రత్యేకత ఏమిటీ..?

Posted: 04/23/2015 03:48 PM IST
Pakistani photo grapher takes photo of lion very closely

ఈ ఫొటో చూశారా..? జూలు విప్పి మరీ వేటకు సిద్దంగా వున్న మృగరాజును చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది కదూ..? ఎంత భయానకంగా వుందో. ఈ అడవి రారాజు...! వేటాండేందుకు సిద్దంగా.. లక్ష్యాన్ని గురి చూసి గర్జిస్తూ.. మరో క్షణంలో మీదకు దూకేందుకు అడుగును మెల్లిగా కదుపుతూ.. తన రౌద్రానంతా ముఖంలోనే చూపుతూ.. అరవీర భయంకరులకే వణుకుపుట్టేట్టు.. గతంలో ఎన్నో సింహాల చిత్రాలను చూశాం కానీ.. ఇంత దెగ్గరగా, ఇలాంటి సన్నివేశంలో వున్న సింహాలను ఎప్పుడు చూడలేద అనుకుంటున్నారా..? అవును నిజమే.. వేటకు సిద్దమైన సింహాన్ని ఇంత దెగ్గరగా చూడటం ఇదే తొలిసారి.

ఎంత సేపు సింహం గురించి మాట్లాడకుంటున్నామే తప్ప.. నిజానికి.. సింహాన్ని ఇంత దెగ్గరగా ఫోటో తీసిన ఫోటోగ్రఫర్ గురించి అసలు అలోచించరేం అంటున్నారా..? ఇలాంటి ఫోటోను తీసిన ఏ ఫొటో గ్రాఫర్ పరిస్థితైనా ఏమైవుంటుందో మనం ఇట్టే ఊహించుకోవచ్చు. గురి పెట్టిన సింహాన్ని అంత దెగ్గరగా వెళ్లి ఫోటో తీయడం.. సాహవాసమే అవుతుంది.  ఈ ఫొటోగ్రాఫర్ పరిస్థితేంటి? అతడికైతే పై ప్రాణాలు పైనే పోయాయట. ఇంతకీ ఇంత సాహసం చేసి మృగరాజును తన కెమెరాలో బంధించిన ఫోటో గ్రాఫర్ ఎవరో తెలుసా..? పాకిస్తానీ ఫొటోగ్రాఫర్ అతీఫ్ సయీద్. ఈ చిత్రాన్ని లాహోర్ సఫారీ పార్కులో తీశాడు.

ఓ రోజు సఫారీ పార్కులో ఫొటోలు తీయడానికి బయల్దేరిన అతీఫ్‌కు ఈ మృగరాజు కనిపించిందట. మహా అందంగా ఉందే అంటూ.. కెమెరా తీసుకుని కారు దిగాడు. చాలా దగ్గరగా తీస్తే.. బాగుంటుందని చెప్పి.. గడ్డిలో నక్కుతూ.. దీని దగ్గరకు పోయాడట. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఫొటో తీసేటప్పుడు వచ్చే ‘క్లిక్’ సౌండ్ ఈ మృగరాజు చెవిన పడింది. అంతే.. ఉగ్ర నరసింహుడి రూపమెత్తింది. అతీఫ్ పైకి దూసుకొచ్చింది. ఒక క్షణం లేటైతే.. అతీఫ్ దానికి ఆహారమైపోయేవాడే.. అతడి టైమ్ బాగుంది. అందుకే ఒలింపిక్ పతకం కోసం పరిగెట్టినట్లు పరిగెత్తి.. కారులో దూరి ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే.. పరిగెత్తే ముందు తన కెరీర్‌లోనే ది బెస్ట్‌గా నిలిచిపోయే ఈ ఫొటోను కూడా క్లిక్‌మనిపించాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistani photo grapher  athif sayeed  safari park  Attacking lion  

Other Articles