Congress | Rahulgandhi | Kedarnathyatra | MOuntains

Congress vice president rahul gandhi will on thursday undertake a yatra to kedarnath

Rahul Gandhi, Kedarnath, Uttarakhand, Gauri Kund, Mandakini

Days after returning here from a 57-day sabbatical, Congress vice president Rahul Gandhi will on Thursday undertake a yatra to Kedarnath. Rahul, 45, will trek 18 kms up into the Uttarakhand mountains to pay obeisance at the temple which faced the brunt of flash-floods two years ago and has since been spruced up.

కేథార్ నాథ్ యాత్రకు రాహుల్.. అన్ని ఏర్పాట్లు పూర్తి..!

Posted: 04/23/2015 09:35 AM IST
Congress vice president rahul gandhi will on thursday undertake a yatra to kedarnath

దాదాపు రెండు నెలల పాటు దేశం విడిచి ఎక్కడక్కెడో తిరిగి వచ్చాక కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తున్నారు. పార్లమెంటు చర్చల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ రెండునెలల 'సెలవు' కాలంలో ఆయన ఎవరికీ తెలియని చోట ధ్యానం చేశారట. దాని ఫలితమో ఏమో తెలియదు గానీ, ఇప్పుడు ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిస లాడుతున్నట్లుంది. ఎవరికి చెప్పకుండా వెళ్లిన ఆయన అంతే హఠాత్తుగా తిరిగి వచ్చారు. ఇక ఏ అవకాశం వదిలేది లేదన్నట్లు వచ్చీ రాగానే, మీ కష్టాలు పట్టించుకుంటానంటూ రైతులతో సమావేశమయ్యారు. తరువాత భారీ రైతు ర్యాలీలో మాట్లాడారు. బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

తరువాతి రోజు లోక్‌సభలోనూ భూసేకరణ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీని సర్కారు పేదలది కాదనీ, సూటూబూటు సర్కారని విమర్శించారు. బుధవారం నెట్‌ న్యూట్రాలిటీ అంశంపై గళం విప్పారు. ఆయనలో వచ్చిన ఈ మార్పును చూసి ప్రజలే కాదు.సొంతపార్టీ వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఆయన దైవభక్తి కూడా పెంచుకున్నట్లుంది. ఉన్నట్లుండి కేదారనాథ్‌ యాత్రను ప్రకటించారు. అది కూడా వెంటనే.. గురువారమే యాత్రకు బయలు దేరుతున్నారు. కేదారనాథ్‌ యాత్ర అంటే సాధారణ విషయం కాదు. అత్యంత ఎత్తైన హిమాలయాల్లో 18 కిలోమీటర్ల దూరం కొండలు ఎక్కుతూ ముందుకు సాగాలి. అక్కడ కేదారేశ్వరుని సందర్శించుకుని ఆయన పూజలు చేస్తారట. మంచుకొండల్లోని అతిపురాతనమైన, చారిత్రాత్మకమైన కేదారనాథ్‌ క్షేత్రం రెండేళ్ల కిందట వచ్చిన తీవ్రమైన వరదల్లో దెబ్బతిన్నది. ఈ మధ్యే దానిని బాగు చేసి పునరుద్ధరించారు. అక్కడికి వెళ్లడానికి రాహుల్‌ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Kedarnath  Uttarakhand  Gauri Kund  Mandakini  

Other Articles