redsandal smugglers are trying to Kill Chandrababu Naidu

Ew red threat to chandrababu naidu

threat to Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, New Red Threat to Chandrababu Naidu, redwood smugglers are trying to Kill Chandrababu Naidu, Seshachalam encounter, intelligence alerts cm security, new Fortuner cars in Vijayawada, safari cars in Hyderabad, prevent any incident during the CM district tours.

Sensing increased threat to Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu in the wake of the Seshachalam encounter, his intelligence and security

చంద్రబాబును టార్గెట్ చేసిన స్మగర్లు.. రెక్కీ నిర్వహణ..?

Posted: 04/22/2015 10:29 PM IST
Ew red threat to chandrababu naidu

నాడు నక్సలైట్లు, నేడు స్మగ్లర్లు... ఆ ఇద్దరి టార్గెట్‌ అతనే... ఆయనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు. శేషాచలం ఎన్‌కౌంటర్‌కు ఎర్రచందనం స్మగ్లర్లు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు హత్యకు కుట్ర జరిగిందా? అన్న ప్రశ్నలకు అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్‌ వర్గాలు. అందుకోసం ఎర్ర దొంగలు రెక్కీ కూడా నిర్వహించారని విశ్వసనీయ సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు చంద్రబాబు నాయుడుకు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

దుబాయ్‌ కేంద్రంగా పావులు కదుపుతున్న ఎర్రచందనం బడా స్మగ్లర్‌ సాహుల్‌ హమీద్‌కు గంగిరెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. హమీద్‌ అనుచరులు ఒక్కొక్కరుగా అరెస్టు కావడంతో వారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పోలీసు పెద్దలను స్మగ్లర్లు టార్గెట్‌ చేశారు. హమీద్‌ అనుచరులు మిజోరాం స్మగ్లర్‌ శామ్యూల్‌, ఢిల్లీ స్మగ్లర్‌ విక్రమ్‌, చెన్నై స్మగ్లర్లు లక్ష్మణన్‌, నాగరాజన్‌, మూసా, శరవణన్‌, సౌందరరాజన్‌ తదితరులు జైలు నుంచే స్కేచ్‌ వేశారు. విచ్చలవిడిగా ఎర్రచందనం స్మగ్లింగ్‌తో కోట్ల రూపాయలకు పడగలెత్తిన స్మగ్లర్లకు శేషాచలం ఎన్‌కౌంటర్‌ రూపంలో గట్టి దెబ్బే తగిలింది. ఒక్క దుంగ కూడా తరలిపోకుండా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు గట్టి చర్యలు చేపట్టడంతో దుంగల దొంగలకు చిల్లి గవ్వ కూడా రాలడం లేదు. దీంతో భయపడిన స్మగ్లర్లు అందరూ ఏకమయ్యారు. పూర్వ వైభవం కోసం ఓ స్కేచ్‌ వేశారు.

తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అరుదైన రాష్ట్ర సంపదను కాపాడుకునేందుకు నడుం బిగించింది. గత ప్రభుత్వ హయాంలో ‘‘నరికినోడికి నరికినంతగా’’ ఉన్న పరిస్థితి కాస్తా ప్రస్తుత ప్రభుత్వం చర్యలతో ‘‘చెట్టుమీద చెయ్యి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదు’’ అనేవరకు వెళ్లింది. కానీ ఈ మాటలను స్మగ్లర్స్ పట్టించుకోలేదు. చివరకు ఓ భారీ ఎన్‌కౌంటర్‌... పోలీసుల మీద అటవీ శాఖ అధికారుల మీద ఎదురు తిరుగుతే ఎన్‌కౌంటర్‌లకు కూడా వెనుకాడమని పోలీసు శాఖ చూపించింది.

ప్రభుత్వం, పోలీసు శాఖ చర్యలతో గల్లీ నుంచి అంతర్జాతీయ స్మగ్లర్ల వరకు అందరూ చేతులు కట్టుకుని కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి మున్ముందు ఇలాగే కొనసాగితే కష్టమే అని భావించి స్మగ్లర్లు ఓ స్కేచ్‌ వేశారు. తమ ఇల్లీగల్‌ దందా ఆగిపోవడానికి కారణం ప్రభుత్వంలోని పెద్దలు, పోలీసు శాఖ... వారిని టార్గెట్‌ చేస్తే అంతా అనుకున్నట్టు అవుతుందని భావించారు. అనుకున్నదే తడవుగా అంతర్జాతీయ స్మగ్లర్లు అందరూ ఏకమయ్యారు. ప్రభుత్వ పెద్దను టార్గెట్‌ చేశారు. ఆ అడ్డు లేకపోతే తమకు ఏ అడ్డూ ఉండదని స్మగ్లర్లు నిర్ణయించుకున్నారు. అందుకోసం రెక్కీ కూడా నిర్వహించారు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనకు వెళ్లిన సమయంలో రెక్కీ నిర్వహించారు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు ధృవీకరించాయి. గతంలో గంగిరెడ్డి మావోయిస్టులతో చేతులు కలిపి అలిపిరిలో దాడికి పాల్పడ్డాడు. తాజాగా ఇంటెలిజెన్స్‌ సమాచారంతో సీఎం సన్నిహితులు ఉలిక్కి పడ్డారు. అయితే ప్రభుత్వం, పోలీసుశాఖ మాత్రం ఎర్రచందనం స్మగ్లర్ల అంతుచూసేందుకు దృఢ చిత్తంతో ఉన్నాయి.

ఎర్రచందనం స్మగ్లర్లు సీఎం చంద్రబాబును టార్గెట్‌ చేశారని తెలియడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తున్నందుకే చంద్రబాబును స్మగ్లర్లు టార్గెట్‌ చేస్తున్నారని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉన్నారని గతంలో చంద్రబాబు నాయుడు మావోయిస్టులను నియంత్రించినందుకే దాడి చేశారని... ఇప్పుడు ఆయనపై ఎర్రచందనం స్మగ్లర్లు కక్షగట్టారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు సుఖంగా ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల అభివృద్ధికి కృషి చేస్తారని, చంద్రబాబుకు భగవంతుడు అండగా ఉంటారని ఎర్రబెల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  Intelligence  redsandal smugglers  

Other Articles