telangana schools to implented cbse pattern acadaemic year

Change in school acedamic year in telangana

change in school acedamic year in telangana, school times, telangana schools to implented cbse pattern acadaemic year, change in school timings, change, changes from forth coming acedamic year, chages from june

Telangana Government discussing with school education department in implementing cbse pattern acadaemic year

పాఠశాల వేళ్లలోనూ మార్పులు.. సిబీఎస్ఈ తరహలో విద్యావార్షికం

Posted: 04/22/2015 03:05 PM IST
Change in school acedamic year in telangana

వచ్చే విద్యా సంవత్సరంలో తెలంగాణలో పాఠశాలల పని వేళలు మారనున్నాయి. పాఠశాల పనివేళల దగ్గర్నించి.. విద్యా వార్షిక సంవత్సరంలో కూడా మార్పలు రమారమి ఖరారయ్యాయి. ఇకపై తెలంగాణలోనూ సీబిఎస్ఈ తరహాలోనే విద్యాబోదన, వార్షికాలు వుండేట్లు తెలంగాణ పాఠశాళ విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు పలు ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చలు ప్రతిఫలించడంతో.. రానున్న విద్యా సంవత్సరం నుంచి మార్పులు చేయనున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలు కోరిన మేరకు పాఠశాలల వేళలను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4.30 నిమిషాల వరకు కొనసాగించేలా మార్పు చేయనున్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం ప్రాథమిక పాఠశాలలను ఉదయం 8:45 గంటల నుంచి మధ్యాహ్నం 3:45 గంటల వరకు, ఉన్నత పాఠశాలలను ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. పాఠశాలల విలీనంపై ఉపాధ్యాయ సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

 అలాగే ఒకటి నుంచి ఐదో తరగతి వరకుప్రతి ప్రాథమిక పాఠశాలలో కచ్చితంగా ముగ్గురు టీచర్లు ఉండేలా చర్యలు చేపడతారు. వారిలో ఒక టీచర్ పూర్తిగా తెలుగు/ఉర్దూ బోధనను, మరో టీచర్ ఇంగ్లిష్, ఇంకో టీచర్ గణితం, సామాన్య, సాంఘిక అంశాలను బోధించాలి’’ అని పాఠశాల విద్యా విషయక క్యాలెండర్‌లో పొందుపరిచిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది.

ఒక నివాస ప్రాంతంలో లేదా ఒకే స్కూల్ ఆవరణలో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలను కిలోమీటరు పరిధిలోకి విలీనం చేస్తారు. ఇది చేసేప్పుడు ఎన్‌రోల్‌మెంట్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రాథమికోన్నత పాఠశాలలను మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఒకవేళ 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నత పాఠశాల లేకపోతే ఆ ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేస్తారు. వాటిలో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ను ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో 75 మందికంటే తక్కువ మంది విద్యార్థులుంటే ఆ స్కూళ్లను ఐదు కిలోమీటర్ల పరిధిలోని మరో స్కూల్లో విలీనం చేయాలా? కొనసాగించాలా? అన్న దానిపై సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి

*  ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు
*  ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉ 9:30 గంటల నుంచి సా 4:30 గంటల వరకు
*  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలను ఉ 8:45 గంటల నుంచి మ 3:45 గంటల వరకు
*  ఉన్నత పాఠశాలలను ఉ 8:45 గంటల నుంచి సా 4:15 గంటల వరకు
*  టెన్త్ పరీక్షలను ఇంటర్ పరీక్షల్లాగే మార్చి 15కి పూర్తి చేయాలి.
*  మిగతా తరగతుల వార్షిక పరీక్షలను ఫిబ్రవరి చివరికి పూర్తి చేయాలి.
*  సీబీఎస్‌ఈ తరహాలో వేసవి సెలవులకు ముందే పై తరగతికి వెళ్లే విద్యార్థులకు కొత్త పాఠ్యాంశాల బోధనను మార్చి 16 నుంచి ప్రారంభించాలి.
*  పాఠ్య పుస్తకాలను మార్చి మొదటి వారం నాటికే విద్యార్థులకు అందించాలి. అందుకోసం పక్కాగా ముద్రణ చేపట్టాలి.
*  స్కూళ్లను ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగించాలి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాలి.
*  ఉపాధ్యాయులకు నిష్ణాతులైన వారితో నాణ్యమైన శిక్షణను అందించాలి.
*  సమరేటివ్ 1, 2, 3   (త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక) పరీక్షల స్థానంలో రెండు సమరేటివ్ పరీక్షలు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : academic year  school timings  teacher unions  school efucation department  

Other Articles