Sujana chowdary | Debit | Court | Marishas

Yalamanchali sujana chowdary facing problems from court

sujana chowdary, sujana group, sujana industries, tdp, marishas, marishas bank,

Yalamanchali sujana chowdary facing problems from court. The court gave instructions to pay debits to the marishas bank.

సుజనా చౌదరికి షాక్.. బాకీ తీర్చాలని కోర్టులో పిటిషన్

Posted: 04/22/2015 12:49 PM IST
Yalamanchali sujana chowdary facing problems from court

తెలుగుదేశంలో నెంబర్ టూగా చలామణి అవుతున్న సుజనా చౌదరికి కొత్త చిక్కువచ్చిపడింది. అయితే చిక్కు పార్టీలోనో లేదా రాజకీయాల్లోనూ కాదు బిజినెస్ లో. అవును సుజనా గ్రూప్ పేరుతో వ్యాపారాలు చేస్తున్న సుజనా చౌదరి అలియాస్ యలమంచలి సత్యానారాయణ చౌదరికి హైకోర్టు షాక్ ఇచ్చింది.సుమారు 106 కోట్ల రూపాయల మేర బకాయిలను చెల్లించడంలో సుజనా యూనివర్సల్‌ విఫలం కావడంతో మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు వైండింగ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కంపెనీని మూసివేసి ఆస్తులు విక్రయించి తమ బకాయిలు జమచేయాలని కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. సుజనా కంపెనీకి వ్యతిరేకంగా మారిషస్‌ సంస్థ గతేడాది నవంబర్‌లోనే వైండప్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ప్రాధమిక వాదనల తర్వాత 2014 డిసెంబర్‌ 8న పిటిషన్‌ను స్వీకరించాలా లేదా అన్న విషయంపై కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది. తాజాగా మంగళవారం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూనే, వైండింగ్‌ అప్‌ పిటిషన్‌ పబ్లికేషన్‌ను మాత్రం ఆరునెలలపాటు వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. బకాయిల చెల్లింపునకు సుజనాకు మరో అవకాశం ఇచ్చేందుకే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
 
సుజనా గ్రూప్‌నకు హేస్టియా హోల్డింగ్‌ పేరుతో మారిషస్‌లో 100 శాతం అనుబంధ సంస్థ ఉంది. ఈ కంపెనీ 2012 ఫిబ్రవరి-జూన్‌ మధ్యకాలంలో మారిషస్‌ బ్యాంకు నుంచి రూ.92 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ రుణానికి సుజనా యూనివర్సల్‌ గ్యారంటర్‌గా ఉంది. హేస్టియా రుణాల చెల్లింపులో విఫలం కావడంతో ఈ విషయాన్ని మారిషస్‌ బ్యాంకు సుజనా యూనివర్సల్‌ దృష్టికి తీసుకువెళ్లింది. కంపెనీ చైర్మన్‌ హోదాలో సుజనా చౌదరి 2012 అక్టోబర్‌ 16న బ్యాంకుకు లేఖ రాస్తూ రుణ డిఫా ల్ట్‌ విషయాన్ని అంగీకరించారు.అయితే బకాయిలను మాత్రం కట్టలేదు.

భవిష్యత్తులో వివాదాలు ఏమైనా తలెత్తితే ఇంగ్లాండ్‌ కోర్టులో పరిష్కరించుకోవాలని కూడా ఒప్పందం చేసుకున్నారు. అప్పు తీసుకున్న హేస్టియా, గ్యారంటర్‌గా ఉన్న సుజనా యూనివర్సల్‌ చేతులెత్తేయడంతో మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు ఇంగ్లాండ్‌ కోర్టులను ఆశ్రయించే సన్నాహాలు చేపట్టింది. అయితే ఈ కేసులో ఇంగ్లాండ్‌ కోర్టులో జూరిస్‌డిక్షన్‌ను సవాలు చేస్తూ.. సుజనా గ్రూప్‌ లండన్‌ హైకోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ క్వీన్స్‌ బెంచ్‌ కమర్షియల్‌ కోర్టు ముందు 2013 ఫిబ్రవరీ 27న పిటీషన్‌ దాఖలు చేసింది. కమర్షియల్‌ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ, జూరిస్‌డిక్షన్‌ అంశాన్ని లేవనెత్తినందుకు సుజనా కంపె నీలపై లీగల్‌ ఖర్చుల కింద రూ.60 లక్షల జరిమానా విధించింది. మారిషస్‌ బ్యాంకు అభ్యర్థనపై బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని లండన్‌ కోర్టు ఆదేశించినప్పటికీ సుజనా గ్రూప్‌ పట్టించుకోలేదని మారిషస్‌ బ్యాంకు ఆరోపణ. లండన్‌ కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించిన మారిషస్‌ బ్యాంకు హైకోర్టులోనూ ప్రస్తుత పిటిషన్‌ దాఖలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sujana chowdary  sujana group  sujana industries  tdp  marishas  marishas bank  

Other Articles