Accident | car | Hit | Two bikes | Reddys labs

Lady hit a ice cream vehicle and two bike in hyderabad jubileehills

Hit, vehicle, jubilehills, car, alchohol, accident, lady, drunk

Lady hit a ice cream vehicle and two bike in hyderabad jubileehills. Accident place in jubilee hills road no.12, a car hit two bikes. Two were injured and one person in critical condition.

మందుతాగి.. యాక్సిడెంట్ చేసి.. యువతి భీభత్సం

Posted: 04/22/2015 09:41 AM IST
Lady hit a ice cream vehicle and two bike in hyderabad jubileehills

మగ వారికి మేమ ఏ మాత్రం తీసిపోమని మహిళలు అంటున్నారు. అయితే మందు తాగే విషయంలో అయినా.. న్యూసెన్స్ చేసే విషయంలో అయినా నేనే ముందుంటాను అంటోంది ఓ యువతి. తప్పతాగి, తాగిన మైకంలో కారుతో యాక్సిడెంట్ చేసింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెం 12లో అర్థరాత్రి ఓ యువతి మద్యం మత్తులో బీభత్సం సృష్టించింది. ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులకు ముచ్చెమటలు పట్టించింది. తప్పతాగి నియంత్రణ కోల్పోయిన ఆమె ఓ కారును ఓవర్ టేక్ చేయబోయి ఓ ఐస్క్రీమ్ బండితో పాటు రెండు బైక్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐస్క్రీమ్ బండి ఓనర్తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

యువతి నడిపిన కారు నంబరు AP 09 CQ 5544 గా పోలీసులు గుర్తించారు. ఆ కారు రెడ్డీస్ ల్యాబ్ పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయినా మగవాళ్లకు పోటీ అంటే ఇలాంటి పోటీనా అంటూ ముక్కున వేలేసుకునేలా చేసింది ఈ యువతి. మరి ఈ ఘటనపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hit  vehicle  jubilehills  car  alchohol  accident  lady  drunk  

Other Articles