Worldeartheday | Google | Doodle | Quiz

World earth day celebrations allover the world

world earth day, celebrations, google, doodle, quiz,

World earth day celebrations allover the world. The google doodle arrange a seperate doodle and conducting a quiz on earth day related questions.

నేడు వరల్డ్ ఎర్త్ డే.. 175 దేశాల్లో పలు కార్యక్రమాలు

Posted: 04/22/2015 10:27 AM IST
World earth day celebrations allover the world

సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి భూమి పరిరక్షణపై ఎంతమందికి అవగాహన ఉంది అంటే సమాధానం శూన్యం. పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కనీసం హాని కలిగించకుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగాహన అవసరం. అటు పర్యావరణం, వాతావరణంతో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరమవుతున్నాయి. ఈ క్రమంలోంచి వచ్చిందే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’. ఏప్రిల్ 22వ తేదిని ప్రతి సంవత్సరం వరల్డ్ ఎర్త్ డే గా జరుపుకుంటారు.  ప్రపంచవ్యాప్తంగా 175 కంటే ఎక్కువ దేశాల్లో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

గూగుల్ వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ప్రత్యేక డూడుల్ ను ఏర్పాటు చేసింది. గూగుల్ డూడుల్ ప్రత్యేకంగా ఎర్త్ డే పై క్విజ్ ను కూడా ఏర్పాటు చేసింది. భూమిని ఎలా కాపాడుకుంటారు.. పరిసరాలను ఎలా రక్షించుకుంటారు అనే పలు రకాల ప్రశ్నలు గూగుల్ డూడుల్ క్విజ్ లో అడుగుతున్నారు.

goole-earthday-doodle

పెరిగిపోతున్న భూతాపం.. వాతావరణ కాలుష్యంతో అల్లాడుతున్న భూమాతను కాపాడుకునే దారేది? పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే అవకాశమేది? ఈ ప్రశ్నలకు సమాధానమే ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. ఆరోజునే ఎందుకంటే.. దానికి మూలాలు 1970లో ఉన్నాయి. ఆ ఏడాది అమెరికన్‌ సెనెటర్‌ గేలార్డ్‌ నెల్సన్‌ పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకుని అమెరికాలో 20 లక్షల మంది ఏప్రిల్‌ 22న ధరిత్రీ దినోత్సవంగా ప్రకటించారు. సాధారణంగా అమెరికన్లు వారాంతాల్లో జాలీ మూడ్‌లో ఉండి ఇలాంటి కార్యక్రమాలకు రారు కాబట్టి.. సోమ, మంగళవారాల్లో ఆఫీసులో మళ్లీ పని ఒత్తిడిలో ఉంటారని.. బుధవారానికి ఆ టెన్షన్ల నుంచి కాస్త బయటపడతారు కాబట్టి ఆ ఏడాది ఏప్రిల్‌ 22 (బుధవారం)ను గేలార్డ్‌ ‘ఎర్త్‌ డే’గా ఎంచుకున్నారు. అంతకుముందు.. 1969లో జాన్‌ మెకానెల్‌ అనే పర్యావరణ వేత్త ఏటా మార్చి 21ని ధరిత్రీ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ రోజు వసంత విషువు కాబట్టి ఆయన ఆ తేదీని ప్రకటించారు. ఆ పిలుపు మేరకు కొన్ని సంస్థలు, కొందరు ప్రజలు మాత్రం మార్చి 21ని ఎర్త్‌ డేగా జరుపుకోగా.. మెజారిటీ ప్రజలు ఏప్రిల్‌ 22నే పాటించేవారు. చివరకు ఐక్యరాజ్య సమితి 2009లో జోక్యం చేసుకుని.. ఇకపై ఏటా ఏప్రిల్‌ 22ను ధరిత్రీ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలూ ఈ రోజును పాటిస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world earth day  celebrations  google  doodle  quiz  

Other Articles