Modi | Obama | TIME | Profile

America president barack obama write profile about pm narendra modi in time magazine

Obama, modi, time, profile, write, introduction, india,

America president Barack obama write profile about Pm narendra modi in TIME magazine. America president described the life of modi in his own words. Modi thanks to Obama and TIME magazine.

మోదీ ప్రొఫైల్ ను స్వయంగా రాసిన ఒబామా.. అరుదైన గౌరవమన్న మోదీ

Posted: 04/17/2015 10:15 AM IST
America president barack obama write profile about pm narendra modi in time magazine

ప్రధానిగా నరేంద్రమోదీ ఎన్నికైన దగ్గరి నుండి విశేషాలే విశేషాలు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విజయాన్ని సాధించిన మోదీ తరువాత ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. టైమ్ మ్యాగజీన్ లో నరేంద్రమోదీ ప్రొఫైల్ ను ఓ ప్రముఖ వ్యక్తి రాశారు. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రపంచానికి పెద్దన్నలాంటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా మోదీ ప్రొఫైల్ ను రాయడం ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలోనూ ప్రధాన వార్తగా నిలిచింది. టైమ్ మేగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు సాధించిన  మోదీని రిఫార్మర్ ఇన్ చీఫ్ గా ఒబామా అభివర్ణించారు. పేదరికం నుంచి ప్రధానమంత్రి వరకు అంటూ మోదీ జీవన ప్రస్థానాన్ని వివరించారు.

obamaonmodi

టైమ్ మేగజైన్‌లో తన ప్రొఫైల్ రాసిన బరాక్ ఒబామాకు నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఒబామా వ్యాఖ్యలు హృదయానికి హత్తుకునేలా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. టైమ్ మేగజైన్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. భారత ప్రధాని మోదీ నాయకత్వ సామర్థ్యాన్ని,  సానుకూల వ్యక్తిత్వాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వివరించారు.

narendramoditweet

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆయన అధినేత. పేదరికం నుంచి ప్రధానమంత్రి పదవి వరకు సాగిన ఆయన జీవన పయనం.. భారతదేశ ప్రగతిశీల సామర్థ్యాన్ని, ఆ దేశ చలనశీలతను ప్రతిబింబిస్తుంది, తన మార్గంలో మరింతమంది భారతీయులు పయనించేలా స్ఫూర్తినిస్తుందని ఒబామా వివరించారు. దేశంలో దారుణంగా నెలకొని ఉన్న పేదరికాన్ని తగ్గించడం, విద్యారంగంలో ప్రమాణాలు పెంచడం, మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం, వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొంటూనే భారతదేశ ఆర్థిక ప్రగతి వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీయడం.. లక్ష్యాలుగా ఆయన ఒక ప్రతిష్టాత్మక, దార్శనిక కార్యక్రమాన్ని చేపట్టారు. భారతదేశం లాగానే ఆయన ప్రాచీన, ఆధునిక భావనల వారధి. సంప్రదాయ యోగాకు ప్రాచుర్యం కల్పిస్తూనే.. ట్వీటర్‌లో ప్రజలతో అనుసంధానమవుతూ డిజిటల్ ఇండియాను కలగంటున్నారు అంటూ మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. వందకోట్లకు పైగా భారతీయులు ప్రగతిపథంలో ఐక్యంగా ముందుకుసాగితే ప్రపంచానికే స్పూర్తినివ్వగలరని ప్రధానమంత్రి మోదీ గుర్తించారని ఒబామా అన్నారు.

మొత్తానికి ఒకప్పుడు అమెరికాలో రావడానికి వీసా నిరాకరించిన దేశం ఇప్పడు అదే నరేంద్ర మోదీ గురించి మాట్లాడుకుంటోంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడే మోదీ ప్రస్థానాన్ని స్వయంగా రాసి, ప్రశంసించడం నిజంగా గ్రేట్. అందుకే మరి నరేంద్రమోదీ గ్రేట్ అని అనడంలోఎలాంటి తప్పులేదు. హాట్సాఫ్ నరేంద్రమోదీ.. హాట్సాఫ్

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles