Masarat alam | Jammu | Kashmir | Arrest

Masrath alam arrested by jammu kashmir police

masarath alam ,separatist, jammu, kashmir, rally, pakistan, central, rajnath singh, mufti,

masrath alam arrested by jammu kashmir police Under pressure from the Centre, the Jammu and Kashmir Police arrested separatist leader Masarat Alam, ahead of his rally in Tral town of Pulwama district on Friday.

వేర్పాటువాద నాయకుడు మసరత్ ఆలం అరెస్ట్

Posted: 04/17/2015 09:45 AM IST
Masrath alam arrested by jammu kashmir police

వేర్పాటువాద నాయకుడు మసరత్ ఆలంను జమ్ము కాశ్మీర్ పోలీసులు అరోస్టు చేశారు. పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తూ, పాకిస్థాన్ జెండాను ప్రదద్శించేలా రెచ్చగొట్టినందుకు జమ్ము కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ జెండా పదర్శించడంపై దేశవ్యాప్తంగా నిరసలు వెల్లువెత్తాయి. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా దీనిపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే మసరత్ ఆలం వ్యవహారంపై జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ మాత్రం చట్టం తన పని చేసుకుపోతుందని చెప్పి చేతులు దులుపుకున్నారు ముఫ్తీ సర్కార్ అధికారంలోకి వచ్చాక వేర్పాటువాద నాయకుడు మసరత్ ఆలం విడుదల జరిగింది. ఆలం విడుదలకు ముఫ్తీ కారణమంటూ అప్పట్లో తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే పులవామా జిల్లాలో నిర్వహించిన వేర్పాటువాదుల ర్యాలీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే మరో నేత సయ్యద్ షా అలీ గిలానీ గంతలో పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యవహరించినందుకు శ్రీనగర్ లో అరెస్టు చేశారు.

వేర్పాటువాదులను పోగేస్తు వసరత్ ఆలం నిర్వహించిన ర్యాలీపై అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ర్యాలీపై మసరత్ ఆలం మాత్రం మరోలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఉద్యమకారులను ఆపాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, వారు మాత్రం ర్యాలీలో పాల్గొన్నారని అంటున్నారు. అయితే లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన హఫీజ్ మహ్మద్ సయిద్ కూడా ర్యాలీలో పాల్గొన్నాలని పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. అయితే మసరత్ ఆలం అరెస్టు ఏ సెక్షన్ కింద చేశారో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ లో డిమాండ్ చేశారు.

diggirajatweet

భారత్ నుండి విడిపోవాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న వేర్పాటు వాదులకు మసరత్ ఆలం, గిలానీలు అండగా నిలుస్తున్నారు. జమ్ము కాశ్మీర్ లో వేర్పాటు వాదానికి సపోర్ట్ చేస్తున్నారని కూడా ముఫ్తీ మహ్మద్ ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న బిజెపిపై కూడా విమర్శలు వస్తున్నాయి. మరి మసరత్ ఆలం, గిలానీలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : masarath alam  separatist  jammu  kashmir  rally  pakistan  central  rajnath singh  mufti  

Other Articles