Vijaymalya | Aircraft | Mumbai | Scrap

Aircrft of vijay malyas kingfisher group goes scrap

Kingfisher, vijaymalya, mumbai, aircraft, credit,

The jet became part of United Spirits in 2005 and was one of the prized possession of Dr Vijay Mallya. It was grounded when Kingfisher Airlines faced difficulties with the upkeep of the aircraft. Silent Enterprises, based in Kurla, Mumbai, have bought the jet from MIAL after making a bid of Rs 22 Lakh. They now hope to recover the amount by ripping the plane apart and selling the parts as scrap.

మాల్యా దుబారా ఫలితం.. విహంగం.. ఆగం.. ఆగం..

Posted: 04/16/2015 03:13 PM IST
Aircrft of vijay malyas kingfisher group goes scrap

బల్లు ఓడలు. ఓడలు బల్లు అవుతాయి అని తెలుగులో నానుడి అందరికీ తెలుసు. అయితే దానికి అచ్చు గుద్దిన్నట్లు సరిపోయే వ్యక్తి ఒకరున్నారు. ఎవరా వ్యక్తి అనుకోకండి.. ఒకప్పుడు రంగుల లోకంలో మస్తీ మజా చేసి. ఐశ్వార్యాలు రాజభోగాలు అనుభవించారు ఆయన. కానీ ఇప్పుడు మాత్రం అప్పులతో సతమతమవుతున్నారు. రాజు పాయె.. రాజ్యాలూ పాయె అన్న చందంగా తయారైంది ఆ పెద్ద మనిషి పని. ఇంతకీ అంత పెద్ద మనిషి అని ఆలోచించకండి.. అది విజయ్ మాల్యా. కింగ్ ఫిషర్ సంస్థ అధినేత. ఒక్కప్పుడు దేశంలో చక్రం తిప్పి రాజభోగాలు అనుభవించిన మాల్యా ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం మాల్యా గారి  విమానం మాత్రం వార్తలకెక్కింది. వార్తల్లోకి ఎక్కేంతగా విమానం స్పెషాలిటి ఏంటా అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..

కింగ్ ఫిషర్ ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ను ముంబై ఎయిర్ పోర్ట్ ప్రవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. గత కొంత కాలంగా బకాయిలు చెల్లించడం లేదని, కాబట్టి కింగ్ ఫిషర్ ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ను స్వాధీనం చేసు్కుంది. అయితే 22 లక్షల రూపాయల కోసం ఆ ఎయిర్ క్రాఫ్ట్ ను ముక్కలు ముక్కలుగా చేసి విడి భాగాలను చెత్త కింద అమ్మేస్తున్నారు. అలా మాల్యాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ స్రాప్ కింద మారడం వార్తల్లో నిలిచింది. అయితే ఒకప్పుడు హుందాగా కనిపించిన ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్ పార్ట్ లుగా కనిపించడంపై అందరు మాట్లాడుకుంటున్నారట. మరి అరుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా.. అని పెద్ద వాళ్లు ఎప్పుడో చెప్పారు. అప్పు ఎప్పటికైనా ముప్పు. మరి దానికి మూల్యంగానే మాల్యా ఇప్పుడు కష్టాలు పడుతున్నాడు. మొత్తానికి మాల్యా కష్టాలు అతని ఎయిర్ క్రాష్ట్ కు కూడా తప్పడం లేదు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kingfisher  vijaymalya  mumbai  aircraft  credit  

Other Articles