bcci anti corruption association special classes | ipl cricketers | ipl fixing mafia

Bcci anti corruption association special classes to ipl cricketers

bcci anti corruption, ipl cricketers, ipl match fixing, ipl match fixing details, ipl fixing mafia, ipl controversies, bcci updates, bcci news

bcci anti corruption association special classes to ipl cricketers : bcci anti corruption association has given special classes to ipl cricketers that how to escape from fixinig mafia.

‘అమ్మాయిలను ఎరగా ఎలా?’ క్రికెటర్లకు క్లాసిచ్చిన బీసీసీఐ

Posted: 04/15/2015 11:36 AM IST
Bcci anti corruption association special classes to ipl cricketers

ఐపీఎల్.. బయటి ప్రపంచానికి ఓ ఉత్సాహకరమైన క్రీడ! కానీ.. లోపల మాత్రం ఫిక్సింగ్ మాఫియా! ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఎలాగోలా జరుగుతూనే వుంది. ఐపీఎల్ -6 సీజన్ లో భాగంగా ఈ ఫిక్సింగ్ బంఢారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఆ తర్వాత 7వ సీజన్ లోనూ ఫిక్సింగ్ జరిగిందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈసారి జరుగుతున్న 8వ సీజన్ లో కూడా ఈ ఫిక్సింగ్ మాఫియా లోలోపలే కొనసాగుతోందన్న అనుమానాలు వచ్చిన నేపథ్యంలో.. దానిని పారద్రోలేందుకు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం కొన్ని కీలకమైన ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా క్రికెటర్లకు స్పెషల్ క్లాసులు తీసుకుంటోందని సమాచారం!

క్రికెటర్లను వశపరచుకొని మ్యాచ్ లను ఫిక్సింగ్ చేయాలని చూసే బుకీలె ఎలాంటి ఎత్తులు వేస్తారోనని తెలుపడంతోపాటు అందులో ఇరుక్కోవద్దని ఆ నిరోధక విభాగం ఐపీఎల్ లోని అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లకు వివరించింది. పైగా.. ఫిక్సింగ్ మాఫియా ఎలా పనిచేస్తుందోన్నన్న విషయంపై వారికి వివరణ ఇచ్చింది. క్రికెటర్లను ఆకర్షించేందుకు బుకీలు మొదట అందమైన అమ్మాయిలను ఎంపిక చేసి.. వారిని అభిమానుల రూపంలో క్రికెటర్ల దగ్గరకు పంపిస్తారని వివరించింది. అనంతరం అమ్మాయిలు ఎంచుకున్న క్రికెటర్లను బుకీలు పరిచయం చేసుకుంటారని, వారిద్దరి పరిచయాన్ని దగ్గరి సంబంధంగా మార్చేందుకు ప్రయత్నిస్తారని తెలిపింది.

bcci-anti-corruption

వారిద్దరి మధ్య బంధం బలపడిందని భావించిన బుకీలు ఆ తర్వాత రంగంలోకి దిగి... సదరు క్రికెటర్లు అమ్మాయితో సన్నిహితంగా వున్న వీడియోలను చిత్రీకరించి వారికి లోబరుకునేందుకు ప్రయత్నిస్తారని వివరించింది. అటువంటి ఆందోళనకరమైన పరిస్థితిలో క్రికెటర్లు పై అధికారులకైన ఫిర్యాదు చేయాల్సి వస్తుంది లేదా బుకీలతో చేతులు కలపాల్సి వస్తుంది. ఆ కీలకమైన సమయాన్ని సదరు ఆటగాడు తేల్చుకోవాల్సి వుంటుందని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం తెలిపింది. ఒకసారి బుకీలు, ఫిక్సర్ల వలలో పడితే మాత్రం వెనక్కు రావడం అంత సులభం కాదని తేల్చి చెప్పింది. మరి.. ఈ పాఠాలతో క్రికెటర్లు ఎంతమేర అవగాహన పొందుతారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bcci anti corruption  ipl fixing mafia  ipl cricketers  

Other Articles