MAA | Elections | Result | Court

City sessions court clear route to maa elections result

maa, elections, court, result, kalyan, jayasudha, rajendraprasad

City sessions court clear route to maa elections result. The city sessions court judge order that the result of maa will depend on election retuning officer. The petetionor O.Kalyan fined for ten thousad rupees.

మా ఫలితాలకు లైన్ క్లీయర్.. రేపు లేదా ఎల్లుండి ఫలితాల విడుదల..!

Posted: 04/15/2015 11:41 AM IST
City sessions court clear route to maa elections result

గత కొంత కాలంగా వాయిదా పడుతూ వచ్చిన మా ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ తొలిగింది. ఎన్నికల ఫలితాల విడుదలకు కోర్టు లైన్ క్లీయర్ చేసింది. మా ఎన్నికల  ఫలితాల విడుదలను నిలిపివేయాలంటూ సినీ నిర్మాత ఓ కళ్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ను సిటీ సివిల్ కోర్టు కొట్టేసింది. ఎన్నికల అధికారి ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని తెలిపింది.

'మా' అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీపడగా, ఎన్నికలు మార్చి 27వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలను నిలిపివేయాలని నిర్మాత ఓ కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కోర్టు కొట్టేసింది. కాగా.. ఓ కళ్యాణ్పై సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలను ఆపలేమని తేల్చి చెప్పింది. కళ్యాణ్కు జరిమానా కూడా విధించింది. కోర్టు సమయాన్ని వృధా చేశారని ఒ.కళ్యాణ్ పై మండిపడిన కోర్టు అతనికి మొట్టికాయలు వేసింది. దాంతో మా ఎన్నికల ఫలితాల వెల్లడికి అన్ని అడ్డంకులు తొలగినట్లయింది. మరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శుక్రవారం లేదా శనివారం ఫలితాలను విడుదల చెయ్యడానికి సన్నాహాలు సాగుతున్నాయని సమాచారం.  మరి ఎన్నికల్లో పోటీలో నిలిచిన జయసుధ, రాజేంద్రప్రసాద్ లలో ఎవరు గెలుస్తారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maa  elections  court  result  kalyan  jayasudha  rajendraprasad  

Other Articles