Aeroplane | Skids | Climate | Japan

Aeroplans are skidding from runways for the climate changes

aeroplanes, airport, skid, runway, japan, airbus, shanfransisco,

aeroplans are skidding from runways for the climate changes. Across the world aeroplanes are skidding from aeroplanes while landing at airports.

పుసుక్కు జర జర డుబుక్కుమే.. పుస్.. పుసుక్

Posted: 04/15/2015 09:47 AM IST
Aeroplans are skidding from runways for the climate changes

ఇదేంటి ఏదో తెలుగు సినిమాలో లిరిక్ అనుకుంటున్నారా.. అలాంటిదే కానీ మ్యాటర్ మాత్రం చాలా సీరియస్. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య గాలిలో ఎగిరే విమానాలు నేల మీదకు ల్యాండ్ అయ్యేటప్పుడు పుసుక్కున జారిపోతేన్నాయి. అయితే మామూలుగా జారిపోతే పర్లేదు ఏకంగా రన్ వేను వదిలి చాలా దూరం వరకు జారి పోతేన్నాయి. ఇలా జారుతున్న విమానాలు కొన్ని సార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆ మధ్య విమానం రన్ వే నుంచి జారిపోయి ఏకంగా పక్కనున్న సరస్సులోకి జారిపడింది. అలా చాలా చోట్ల చాలా సార్లు విమానాలు రన్ వే పై ల్యాండింగ్ కు వచ్చి జారిపోతున్నాయి. అయితే రెండేళ్ల క్రితం ఇలా జారిపోయిన విమానాల్లో ఏషియానా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కూలి ఏకంగా 200 మంది చనిపోయారు.

అయితే తాజాగా జపాన్లో విమానం జారిపోయింది.. అయినా ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. జపాన్ లోని ఓ విమానం రన్వే మీద ల్యాండయిన తర్వాత జర్రున జారిపోయింది. దాంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని జపాన్ అధికార వార్తాసంస్థ ఎన్హెచ్కే తెలిపింది. ఈ కారణంగా హిరోషిమా విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి 74 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఏషియానా ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ 320 విమానం హిరోషిమా విమానాశ్రయానికి చేరుకుంది. తీరా అక్కడ రన్వే సరిగా లేకపోవడంతో జర్రున జారిపోయింది. దాంతో ప్రయాణికులను నేరుగా దించేందుకు వీలు కుదరక.. అత్యవసర మార్గాల ద్వారా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటో మాత్రం తెలియలేదు. మొత్తానికి ఇలా విమానాలు జారిపోతున్నాయి. విమానంలో కూర్చున్న వారి ప్రాణాలు అమాంతం గాలిలో కలిసిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటో అధికారులు ఆలోచించాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aeroplanes  airport  skid  runway  japan  airbus  shanfransisco  

Other Articles