APSRTC | AP | Buses | Protection

Apstrc clear that need protection for buses while travelling to chittur to tamilnadu

tamilnadu, ap, buses, transport, travelling, chittur, apsrtc, tirupathi

Apstrc clear that need protection for buses while travelling to chittur to tamilnadu. The tamilnadu state fire on encounter at chittur dist. sheshachalam forest. Protests going on at Tamilnadu.

కాపాడతాం అంటేనే కదిలిస్తాం.. లేదంటే లేదు

Posted: 04/15/2015 09:20 AM IST
Apstrc clear that need protection for buses while travelling to chittur to tamilnadu

చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పింది. తమిళ కూలీలను కావాలనే కాల్చి చంపారంటూ తమిళనాట తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా తమిళనాడులో ఉన్న ఆంధ్ర వాహనాలకు నిప్పు పెట్టడం, ఆంధ్రకు చెందిన ఆస్తులను ధ్వంసం చెయ్యడం ప్రారంభమైంది. దాంతో రెండు రాష్ట్రాల మధ్య రవాణా నిలిచిపోయింది. ఇక రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో అయితే మరీ ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రా నుండి ఎలాంటి వాహనాలు కానీ చివరకు మనుషులకు కూడా ప్రవేశం లేనంతగా పరిస్థితి మారింది.  

అయితే తమను కాపాడతామని హామీ ఇస్తేనే తమిళనాడుకు బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. గత ఆరు రోజులుగా చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్లాల్సిన బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సు సర్వీసుల పునరుద్ధరణ కోసం తమిళనాడు అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ మంతనాలు జరుపుతోంది. కానీ, ఈ విషయంలో తమిళనాడు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో తమిళ కూలీల ఎన్కౌంటర్ను నిరసనగా తమిళనాడులో ఇంకా ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగానే కొనసాగుతున్నాయి. దీంతో ఆందోళనల ముసుగులో బస్సుల పై దాడులు చేస్తే ఆర్టీసీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తమిళనాడుకు సర్వీసులను రద్దు చేయడంతో 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిలినట్టు అంచనా. మరో పక్క తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. రెండు రాష్ట్రాల గొడవల సంగతి ఏమో కానీ మా కష్టాలు ఆ శ్రీనివాసుడికి తెలుసు అంటూ శ్రీవారికి మొరపెట్టుకుంటున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamilnadu  ap  buses  transport  travelling  chittur  apsrtc  tirupathi  

Other Articles