ap minister manikyala rao | actor shivaji | somu veerraju

Ap minister manikyala rao warns actor shivaji scolding somu veerraju

actor shivaji, telugu actor shivaji, bjp leader shivaji, somu veerraju news, minister manikyala rao, manikyala rao news, manikyala rao controversy, actor shivaji controversy, ap special status, bjp party controversies

ap minister manikyala rao warns actor shivaji scolding somu veerraju : Ap bjp minister manikyala rao given strong warning to actor turned political leader shivaji for questioning somu veerraju who is playing important role in party.

నటుడు శివాజీకి వార్నింగ్ ఇచ్చిన ఏపీ మంత్రి

Posted: 04/14/2015 05:47 PM IST
Ap minister manikyala rao warns actor shivaji scolding somu veerraju

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ గతకొన్నాళ్ల నుంచి పోరాటం కొనసాగిస్తున్న నటుడు శివాజీ.. తనను తాను బీజేపీ కార్యకర్తగా పేర్కొంటున్న విషయం తెలిసిందే! అయితే.. శివాజీ ఈ విధంగా ప్రకటించిన నేపథ్యంలో శివాజీ అసలు బీజేపీ నేతనే కాదని, అతనికి బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గతంలో వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మొదట స్పందించని శివాజీ.. ‘నేను బీజేపీ కార్యకర్త కాదని చెప్పేందుకు సోము వీర్రాజు ఎవరు?’ అని ఆయనపై మండిపడ్డారు. శివాజీ వ్యాఖ్యలపై వీర్రాజు ఇంకా స్పందించలేదు కానీ.. తాజాగా ఏపీ దేవాదాయ శాఖమంత్రి, బీజేపీ నేత మాణిక్యాల రావు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే మాణిక్యాల రావు మాట్లాడుతూ.. ‘శివాజీ.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు. సోము వీర్రాజు ఎవరని ప్రశ్నిస్తున్నావు. పార్టీలో కీలక వ్యక్తిగా వున్న వీర్రాజునే ప్రశ్నించడం సరికాదు. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకుని పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అంటూ ఆయన శివాజీకి వార్నింగ్ ఇచ్చారు. మరి ఈయన ఇచ్చిన వార్నింగ్ పై శివాజీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే! ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. బీజేపీ పార్టీ సభ్యులకు, నటుడు శివాజీకి మధ్య ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు కనిపిస్తున్నాయి. ఇలాగే మాటామాటా పెరిగితే.. మరిన్ని వివాదాలు తెరలేచే అవకాశముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor shivaji  somu veerraju  manikyala rao  bjp party  

Other Articles