Madras High Court | Dravidar Kazhagam | thaali removal function

Madras high court stays dravidar kazhagam holds thaali removal function

Dravidar Kazhagam, Dravidar Kazhagam thaali removal function, thaali removal function, chennai thaali removal function, Dravidar Kazhagam controversy, Dravidar Kazhagam organisation, madras high court, Dravidar Kazhagam thaali function, 25 women remove thaali

Madras High Court stays Dravidar Kazhagam holds 'thaali' removal function : The controversial 'Mangalsutra (Thaali) removal function', organised by the Dravidar Kazhagam, was held early this morning before the Madras High Court ordered a stay on organising of the event.

బానిసత్వ చిహ్నాలంటూ తాళి తెంచేసిన తమిళ మహిళలు

Posted: 04/14/2015 04:53 PM IST
Madras high court stays dravidar kazhagam holds thaali removal function

హిందువుల సంస్కృతీ-సంప్రదాయాల్లో ‘తాళి’కున్న మహత్యం ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భర్తల ద్వారా తాళి కట్టించుకునే భార్యలు వాటిని దైవంగా పోలుస్తారు. తమ భర్తలు సుఖంగా, కలకాలం జీవించాలని దేవుడికి ప్రార్థిస్తూ తాళిని పూజిస్తారు. అంతటి ప్రాముఖ్యత గల తాళిని కొందరు బానిసత్వానికి చిహ్నాలంటూ నిండుసభలో వాటిని తెంచేసి సరికొత్త వివాదానికి నాంది పలికారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 25 మహిళలు ఓ సభాప్రాంగణంలో తమ తాళిని తెంచేసి.. మేము బానిసత్వపు జీవితం నుంచి విముక్తి పొందామంటూ గర్వంగా చెప్పుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటన చెన్నైలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... మహిళల మెడల్లోని మంగళసూత్రాలకు ఎలాంటి మహత్తు లేదని, అవి బానిసత్వానికి చిహ్నాలని, వాటిని తెంపేసి బానిసత్వం నుంచి విముక్తులుకండంటూ తమిళనాడులోని ద్రావిడార్ కళగం సంస్థ తాజాగా ఓ ఉద్యమం చేపట్టింది. అయితే ఈ ఉద్యమం మొదట హిందూ మతవాదుల ఆందోళనలతో వివాదాస్పమైంది. వారు కోర్టుకు కూడా వెళ్లారు కానీ.. మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జీ జస్టిస్ డీ హరి పరాంతమమ్ భావ ప్రకటన స్వేచ్ఛ కింద ద్రావిడార్ మంగళవారం తలపెట్టిన మంగళసూత్రం తెంపేసే కార్యక్రమానికి అనుమతించారు.

ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఆ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో 25 మంది మహిళలు తమ మెడలోని మంగళ సూత్రాలను తెంపేశారు. అనంతరం తాము బానిసత్వం నుంచి విముక్తి అయినట్టు గర్వంగా ప్రకటించారు. అలాగే.. వాటికున్న బంగారాన్ని హేతువాద ద్రావిడార్ కళగంకు విరాళంగా ఇచ్చారు. ‘ఆహా తాళి తెంచేయడంతో ఎంతో ఉపశమనంగా ఉంది. ఇంతకాలం దీన్ని ఓ అవమానకరమైన చిహ్నంగానే చూశాను. ఇక ముందు ఇది నా మెడలో లేకపోవడం వల్ల నాకు కలిగే బాధేమి లేదు’ అని ఈ కార్యక్రమంలో తాళి తెంచేసిన ఓ మహిళ వ్యాఖ్యానించారు.

అయితే.. ఇంతలోనే ఈ కార్యక్రమాన్ని నిలిపినేస్తూ హైకోర్టు నుంచి ద్విసభ్య బెంచి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. మొదట ఈ కార్యక్రమానికి  మద్రాస్ హైకోర్టు అనుమతివ్వగా.. హిందూ మతవాదుల ఒత్తిడి మేరకు రాష్ట్రప్రభుత్వం కోర్టు సింగిల్ జడ్జీ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని 19(2)(3)అధికరణ మేరకు ద్రావిడార్ కళగం చేపట్టిన కార్యక్రమాన్ని నిషేధిస్తున్నట్టు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. దీంతో న్యాయ పోరాటంలో తాము విజయం సాధించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని ద్రావిడార్ కళగం అధ్యక్షుడు కే వీరమణి ప్రకటించారు.

అలాగే ద్రావిడార్ కళగం ఈరోజు సాయంత్రం చేపట్టిన ‘ఆవు మాంసాహార విందు’ కార్యక్రమాన్ని కూడా కోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేసుకుంది. మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలకు వ్యతిరేకంగా ద్రావిడార్ కళగం ఈ విందు కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంది. ప్రముఖ తమిళ నాయకుడు, హేతువాది పెరియార్ రామస్వామి స్ఫూర్తితో ద్రావిడార్ కళగం ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే.. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ విందు కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Dravidar Kazhagam  thaali removal function  madras high court  

Other Articles