Sakshi Maharaj controversial comments Family planning | bjp party controversy

Sakshi maharaj controversial comments family planning

sakshi maharaj news, bjp party news, bjp party updates, bjp party controversy, bjp party controversial news, sakshi maharaj controversy, family planning, bjp govt, india population

sakshi maharaj controversial comments Family planning : bjp mp sakshi maharaj controversial comments on family planning. He told that government should take action on family planning.

కుటుంబ నియంత్రణ పాటించనివారికి ఓటుహక్కు క్యాన్సిల్

Posted: 04/13/2015 07:53 PM IST
Sakshi maharaj controversial comments family planning

జనాభా లెక్కల ప్రకారం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో వున్న విషయం తెలిసిందే! దేశానికి స్వాతంత్ర్య వచ్చినప్పుడు కేవలం 30 కోట్లు మాత్రమే వుండే జనాభా.. ఇప్పుడు ఏకంగా 130 కోట్లకు చేరింది. గతంలోనే ప్రభుత్వాలు ఈ హద్దూఅదుపులేకుండా పెరిగిపోతున్న జనాభా సంఖ్యను తగ్గించేందుకు కుటుంబ నియంత్రణ అనే ప్రణాళికలు చేపట్టాయి. ముగ్గురు లేదా ఇద్దరు మాత్రమే పిల్లల్ని కనాలంటూ అప్పట్లో ఆయా ప్రభుత్వాలు నినాదాలు చేశాయి. అయినప్పటికీ జనాభా మాత్రం పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం జనాభాలో రెండో స్థానంలో వున్న భారత్.. త్వరలోనే మొదటి స్థానంలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ నేపథ్యంలోనే తాజాగా వివాదాస్పద ప్రకటనలు చేయడంలో దిట్టైన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్.. పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆ చట్టాన్ని అనుసరించని వారి ఓటు హక్కును తీసేయాలని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘హిందువులు కుటుంబ నియంత్రణలో భాగంగా వేసక్తమీ, ట్యుబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు. ముస్లింలు కూడా దాన్నే ఎంచుకోవాలి. ఈ విషయంలో అందరికీ ఒకే చట్టం వుండాలి. దీన్ని ప్రభుత్వం త్వరగా అమలు చేయాలి’ అని ఆయన కోరారు.

ప్రస్తుతం దేశాన్ని జనాభా పెరుగుదలే కుదిపేస్తోందని.. అది పెద్ద సవాలుగా మారిందని ఆయన నొప్పి చెప్పారు. స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్లు వున్న జనాభా.. ఇప్పుడు 130 కోట్లకు చేరిందని ఆయన గుర్తుచేశారు. ఇలా జనాభా ఒక్కసారిగా పెరిగిపోవడానికి బాధ్యులెవరు? అంటూ ప్రశ్నించారు. దీంతో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఎందుకంటే.. గతంలో ప్రతి ఒక్క హిందూ మహిళల నలుగురు పిల్లల్ని కనాలంటూ వ్యాఖ్యానించిన ఈయన.. ఇప్పుడు కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.. ఈ విషయం భవిష్యత్తుల్లో ఎన్ని వివాదాలకు తావిస్తుందోనని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sakshi maharaj  india population  bjp controversy  

Other Articles