Gandhi racist defaces statue with white paint in South Africa

Group calls gandhi racist defaces statue with white paint in south africa

gandhi statue, mahatma gandhi statue, south africa crime news, gandhi south africa statue, gandhi racist, group calls gandhi racist, gandhi statue racist, south africa gandhi statue

Group calls Gandhi racist defaces statue with white paint in South Africa : A statue of Mahatma Gandhi has been defaced by a group of people who threw buckets of white paint on it amid racist taunts.

సౌతాఫ్రికాలో గాంధీ విగ్రహంపై దాడిచేసిన ముష్కరమూక

Posted: 04/13/2015 08:14 PM IST
Group calls gandhi racist defaces statue with white paint in south africa

జాత్యహంకార విముక్తి ఉద్యమానికి దక్షిణాఫ్రికాలో స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహాత్మా గాంధీ విగ్రహానికి... ఆ దేశంలోనే ఘోర అవమానం జరిగింది. జొహెన్నెస్బర్గ్తో మహాత్ముని అనుబంధానికి గుర్తుగా ఆ నగరం నడిబొడ్డున 1997లో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగిన ఆ విగ్రహం వున్న ప్రాంతాన్ని గాంధీ స్వేర్గా వ్యవహరిస్తున్నారు. అటువంటి ప్రాంతంలో ఆయన విగ్రహంపైనే ఓ ముష్కర మూక దాడి చేయడం సంచలనంగా మారింది. గాంధీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ జొహాన్నెస్బర్గ్లోని ఆయన విగ్రహంపై ఓ ముష్కర మూక తెలుపు రంగు చల్లి, వ్యతిరేక నినాదాలు చేసింది.

ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) పార్టీ లోగో ధరించిన కొందరి యువకుల బృందం.. తెలుగు రంగులతో నిండిన బకెట్లను తీసుకొచ్చారు. గాంధీని జాత్యహంకార వాదిగా పేర్కొంటూ ఆయన గాంధీ విగ్రహంపై తెలుపురంగును జల్లారు. అంతటితో ఆగకుండా గాంధీని సౌతాఫ్రికాలో వున్న ఆయన విగ్రహాలన్నింటిని కూల్చాలని నినాదాలుచేశారు. అయితే.. పరిస్థితి మరింత వేడెక్కకముందే అక్కడికి పోలీసులు చేరుకుని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తి విధ్వంసం కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఉదంతంపై స్పందించిన ఏఎన్సీ పార్టీ.. గాంధీ తమకు ఆరాధ్యుడని, విగ్రహంపై దాడిలో తమ పార్టీ ప్రమేయం లేదని ప్రకటించింది. ఇదంతా అధికారపార్టీ ఆడుతున్న నాటకమని విమర్శించింది. ఇదిలావుండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీవిగ్రహాల్లోకెల్లా జొహాన్నెస్ బర్గ్ విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే.. గాంధీజీ యుక్తవస్కుడిగా చూపే ఏకైక విగ్రహం ఇదొక్కటే! ఈ ఉదంతం భవిష్యత్తుల్లో మరిన్ని వివాదాలకు తెరలేపే అవకాశముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gandhi statue  south africa racist group  mahatma gandhi news  

Other Articles