Saniamirza | Mixeddoubles | Hingis | Miami

Sonia mirza got world no one in womens double

sonia mirza, womens double, Indian, tounament, Miami, Family Circle.Hingis

sonia mirza got world no one in womens double. No Indian woman had ever been No. 1 in singles or doubles until the 28-year-old Mirza. She says she's proud of the achievement and thanks Hingis for helping her get there. The two have won their past three events, capturing titles at Indian Wells and Miami before the Family Circle.

వరల్డ్ నెంబర్ వన్ గా సానియా మీర్జా..

Posted: 04/13/2015 10:31 AM IST
Sonia mirza got world no one in womens double

నిన్న సైనా నెహ్వాల్.. తాజాగా సానియా మీర్జా. భారత కీర్తి ప్రతిష్టలను మరింత పెంచుతున్నారు. క్రీడాప్రపంచంలో భారత్ కీర్తిని చాటుతున్నారు. ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మార్టినా హింగిస్‌తో కలిసి సానియా మీర్జా ఫ్యామిలీ సర్కిల్ కప్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది.
 
 ఈ టైటిల్‌తో మహిళల టెన్నిస్ సంఘం డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను హస్తగతం చేసుకుంటుంది. మార్టినా హింగిస్‌తో కలిసి సానియాకిది వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం. అయితే గత కొంత కాలంగా సానియా మీర్జా పర్ఫామెన్స్ తగ్గిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే అలాంటి విమర్శలకు ధీటుగా సానియా మీర్జా ప్రపంచ నెంబర్ వన్ టైటిల్ ను సాధించింది.

ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించడంపై సానియా మీర్జా ట్విట్టర్ లొ అందరితో తన ఫీలింగ్స్ ను పంచుకున్నారు. తనకు ముందు నుండి సపోర్ట్ చేసిన తన పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్, కోచ్ లకు ధ్యాంక్స్ చెప్పారు. నెంబర్ వన్ స్థానాన్ని పొందాలని ప్రతి ఆటగాడు అనుకుంటారని, తాను కూడా వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉందని సానియా తెలిపారు. తనకు ఇంత అదృష్టాన్ని ఇచ్చిన దేవుడికి సానియా ధన్యవాదాలు తెలిపారు.

saniamirzatweet1

tweet02

 

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia mirza  womens double  Indian  tounament  Miami  Family Circle.Hingis  

Other Articles