Governor | Permission | President | Tour

Governors asked not to leave states without president s permission

Governors, Permission, president, tours, home ministry, notification, calender,

The Union Home Ministry has notified new set of rules to “regulate” official visits of Governors outside their States, mandating prior permission from the President and putting a cap of 73 days in a year as the duration of such visits.

గవర్నర్ల స్పీడ్ కు బ్రేక్.. అన్నింటికి అనుమతి తీసుకోవాల్సిందే

Posted: 04/13/2015 11:07 AM IST
Governors asked not to leave states without president s permission

గవర్నర్ల పర్యటలకు బ్రేక్‌ వేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనల ప్రకారం గవర్నర్లు పక్క రాష్ట్రాల పర్యటన దగ్గరి నుండి విదేశీ పర్యటనలు చేయడం వరకు అన్నింటిపైనా కేంద్రం ఆంక్షలు విధించింది. ఏ గవర్నర్‌ రాష్ర్టాన్ని వీడి వెళ్లాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి చేస్తూ కేంద్రం నిబంధనలు విధించింది. దీంతో గవర్నర్ల ఇష్టానుసార పర్యటనలకు మూకుతాడు పడినట్లైంది. గవర్నర్స్‌ అమెండ్‌మెంట్‌ రూల్స్‌ 2015 పేరుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 18 కొత్త నిబంధనలు నోటిఫై చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. గవర్నర్లు ఏడాదిలో 73 రోజులకు మించి వేరే రాష్ట్రాల్లో పర్యటనలు చేయకూడదు. అంతేకాకుండా ఏడాదిలో 80 శాతం ఏ రాష్ట్ర గవర్నర్‌ ఆ రాష్ట్రంలోనే ఉండాలి. గవర్నర్లు వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లాల్సి వస్తే రెండు వారాల ముందే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అధికారిక కార్యక్రమాల కోసమైతే వారం ముందు అనుమతి తీసుకోవాలి.  విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటే ఆరు వారాల ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.

ఏడాదికి కనీసం 292 రోజులు తమ రాష్ట్రాల్లోనే ఉండాలని, రాష్టప్రతి ఆమోదించకుండా రాష్ట్రాన్ని వదిలిపెట్టివెళ్లరాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ల పర్యటనలపై ఆంక్షలు విధించింది. కొంతమంది గవర్నర్లు ఎక్కువ రోజులు తమ రాష్ట్రానికి దూరంగా ఉంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. రాష్టప్రతినుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఎలాంటి పర్యటనలూ చేపట్టరాదని, ఒక వేళ అత్యవసర, అసాధారణ పరిస్థితుల్లో పర్యటనలు జరపాల్సి వస్తే ఆ విషయాన్ని ముందుగా రాష్టప్రతి సెక్రటేరియట్‌కు తెలియజేయాలని హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన 18 సూత్రాల నియమావళిలో పేర్కొన్నారు. ఒక వేళ చివరి క్షణాల్లో పర్యటనలు జరపాల్సి వస్తే ఏ పరిస్థితిలో అలా పర్యటించాల్సి వచ్చిందో గవర్నర్లు కారణాలను వివరించాల్సి ఉంటుంది.

రాష్ట్రానికి బయట జరిపే పర్యటనలకు అనుమతి కోసం అభ్యర్థనలను అది అధికార పర్యటనా లేక వ్యక్తిగతమా, వెళ్లేది భారత్‌లోని ప్రాంతానికా లేక విదేశాలకా అనేదాన్ని బట్టి పర్యటనకు వారం రోజులనుంచి ఆరువారాల ముందుగా రాష్టప్రతి భవన్‌కు పంపించాలి. ప్రతి అభ్యర్థన కాపీని ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి , కేంద్ర హోం మంత్రికి కూడా పంపించాలి. ఏ గవర్నర్ అయినా ప్రైవేట్ పర్యటనను అధికారిక పర్యటనగా చూపించకుండా ఉండేందుకు గాను రాజ్‌భవన్‌లు వారి ప్రతి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్టప్రతికి పంపించడమే కాకుండా ఏదయినా మార్పు ఉంటే రాష్టప్రతి భవన్‌కు తెలియజేయాలి. గవర్నర్ జరిపే అలాంటి పర్యటనల కాలపరిమితి ఒక క్యాలెండర్ సంవత్సరంలో 20 శాతం రోజులకు మించకూడదని కూడా ఆ నోటిఫికేషన్ స్పష్టం చేసింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governors  Permission  president  tours  home ministry  notification  calender  

Other Articles