Amaravathi | Chandrababu | Telugudesam

Nara chandrababu new slogun for new capital amaravathi calling

Nara, ap, capital, amaravathi, cahndrababu, china, investments, telugudesam,

nara chandrababu new slogun for new capital amaravathi calling. Nara chandrababu, when the elections arrives babu call for slogun telugudesam calling, but now babu took new slogun instead of telugudesam.

తెలుగుదేశంను వదిలేసిన చంద్రబాబు..

Posted: 04/13/2015 08:00 AM IST
Nara chandrababu new slogun for new capital amaravathi calling

తెలుగుదేశం పిలుస్తోంది అని నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం మనం గతంలోనే విన్నా.. కానీ ఈ మధ్య తెలుగుదేశం కాదు వేరే నినాదాన్ని ఎత్తుకున్నారు. తాజాగా ఏపి కొత్త రాజధాని అమరావతి పిలుస్తోందని అంటున్నారు చంద్రబాబు. అందులో భాగంగా అన్ని దేశాల నుండి అమరావతి పిలుస్తోంది.. పెట్టుబడులు పెట్టండి అంటూ పిలుపునిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి రావాలని, అపారమైన సహజ సిద్ధమైన వనరులకు ఆంధ్రప్రదేశ్ నిలయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతామని, భారీ నిర్మాణాలు ఇక్కడ రానున్నాయని, సిమెంట్ ఉత్పత్తులకు ఆంధ్రాలో మంచి గిరాకీ ఉండబోతోందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ఎర్రతివాచీ పరుస్తామని, అన్ని పారిశ్రామిక అనుమతులను సింగిల్ డెస్క్ ద్వారా 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని బాబు ప్రకటించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని ఏపి ముఖ్యమంత్రి వెల్లడించారు.

నూతన రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.  చైనా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం చైనా రాజధాని బీజింగ్‌లో ఆ దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించారు. సినోమా ఇంటర్నేషనల్ సంస్థ అధినేత సుషాన్ మాట్లాడుతూ సిమెంట్, పవన విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సిమెంట్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మొత్తానికి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పిలిస్తే కొత్త రాష్ట్రానికి రావలసిందిగా అమరావతి పిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు.

- అభినవచారి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara  ap  capital  amaravathi  cahndrababu  china  investments  telugudesam  

Other Articles