No sympathy for smugglers and terrorists says Venkaiah

Venkaiah naidu statement on simi terrorists

No sympathy for smugglers and terrorists says Venkaiah, union minister Venkaiah Naidu, Union Minister, Support, Chandrababu Naidu, Venkaiah on red sandal smugglers, Venkaiah on simi terrorists encounter, Urban Development Minister Venkaiah Naidu

Union minister for Urban Development M Venkaiah Naidu stated that he has no sympathy for anti-social elements like smugglers and terrorists.

ఉగ్రవాదులను, స్మగర్లపై ఎలాంటి సానుభూతి కూడదు..!

Posted: 04/11/2015 08:10 PM IST
Venkaiah naidu statement on simi terrorists

మానవ హక్కుల సంఘాలకు ద్వంద్వ ప్రమాణాలు సరికాదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సిమీ కార్యకర్తలను, ఎర్రచందనం దొంగలను చంపితే మానవహక్కులు గుర్తుకు వస్తాయా? అంటూ ఆయన ప్రశ్నించారు. విధి నిర్వహణలో అధికారులు చనిపోతే మానవహక్కులు ఎందుకు జోక్యం కల్పించుకోలేదని ఆయన నిలదీశారు. రెండు రోజుల వ్యవధిలో నలుగురు పోలీసులపై బహిరంగంగా కాల్పలు జరిపి హతమార్చినప్పడు మానవ హక్కుల సంఘాలు ఏం చేశాయని ప్రశ్నించారు.

గత కోన్నేళ్లుగా అటవీ సంపదను దోచుకుని.. అడ్డగించిన అటవీ శాఖ అధికారులను, పోలీసులను టాస్క ఫోర్స్ అధికారులను హతమర్చిన వారు కేవలం కూలీలే అంటూ వితండవాదాన్ని తెరపైకీ తీసుకురావడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. అధికారులు మనుషులు కాదా, వారు విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోలేదా అని ఆయన నిలదీశారు. అధికారులవి ప్రాణాలకు కాదు.. జాతీ సంపదను దోచుకునే వారివి మాత్రమే ప్రాణాలా అని మండిపడ్డారు. ఉగ్రవాదులు పోలీసులను చంపినప్పుడు మజ్లీస్‌ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్పై నిఘా వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. ముద్రా బ్యాంక్, ఇన్సూరెన్స్, జన్ధన్ యోజన పేద ప్రజల ప్రయోజనాల కోసమేనని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఎర్ర చందనం కూలీల ఎన్ కౌంటర్ విషయంలో విచారణ చేయాలనడం సబబేనని వెంకయ్య అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  congress  netraji subhash chandra bose  

Other Articles