jc diwakar reddy question arun jaitley | Anantapur Public Meeting

Jc diwakar reddy question arun jaitley in public programme

jc diwakar reddy, arun jaitley news, ap special status, anantapur district, jc diwakar controversies, bjp party ministers, tdp party ministers

jc diwakar reddy question arun jaitley in public programme : Ap tdp minister jc diwakar reddy questioned central minister arun jaitley in public meeting first which gone viral. But after jc cools his temper.

సభాసాక్షిగా.. అరుణ్ జైట్లీని నిలదీసిన జేసీ దివాకర్ రెడ్డీ

Posted: 04/11/2015 08:39 PM IST
Jc diwakar reddy question arun jaitley in public programme

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి ధైర్యమున్న నేతగా పేరున్న విషయం తెలిసిందే! ఏదైనా వివాదం చెలరేగిన నేపథ్యంలో జేసీ ఏమాత్రం తడబడకుండా నేతలను నిలదీయడం, ప్రశ్నించడం లాంటివి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈయన అదేవిధంగా సభాపక్షంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని నిలదీసి వార్తల్లో నిలిచిపోయారు.

అనంతపురం గోరంట్ల జిల్లా మండలం పాలసముద్రంలో ఏర్పాటు చేయనున్న జాతీయ కస్టమ్స్ అకాడమీ శంకుస్థాపనకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డీ సైతం వెళ్లారు. ఈ క్రమంలోనే జేసీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రధాని రాజ్యసభలో హామీ ఇచ్చిన ‘ఏపీకి ప్రత్యేక హోదా’ విషయం ఏమైందంటూ ప్రశ్నించారు. అలాగే.. అనంతపురం జిల్లాకు రాయితీలు ఏవని ఆయన కాస్త ఆవేశంగానే నిలదీశారు. దీంతో అక్కడి వాతావరణం కాస్త ఉత్కంఠభరితంగా మారిపోయింది. మాటమాట పెరిగి ఏదైనా వివాదం చోటు చేసుకుంటుందేమోనని అంతా భావించారు. కానీ.. అలాంటి వివాదమేమీ చోటు చేసుకోలేదు.

ముందుగా కాస్త ఆవేశంగా జైట్లీని నిలదీసిన జేసీ.. ఆ తర్వాత సర్దుకుని పన్ను రాయితీలు, కరువు భత్యాలు ప్రకటించి తమ జిల్లాను ఆదుకోవాలని కోరారు. అలాగే.. రాయలసీమకు నీరందించేందుకు బాబు శక్తివంచన ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనకు ఆర్థికపరంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో అక్కడి వాతావరణం చల్లారిందని స్థానిక ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jc diwakar reddy  arun jaitley news  bjp party  

Other Articles