Rahulgandhi | cartoons | Net | Congress

Some cartoons on congress vice president rahul gandhi go viral in net

rahulgandhi, cartoons, aicc, congress, soniagandhi, leave

some cartoons on congress vice president rahul gandhi go viral in net. The congress vice president rahul ganhi went leave since feb.16. Till now his not in the address.

రాహుల్ బాబు ఎక్కడున్నా..డో.. నెట్ లో కార్టూన్ల హల్ చల్

Posted: 04/11/2015 11:13 AM IST
Some cartoons on congress vice president rahul gandhi go viral in net


రెండు వారాల సెలవు పై వెళ్లి... ఏకంగా ఏడు వారాలు దాటింది. అయినా అడ్రస్ లేరు ఆ మనిషి. ఆయనెవరో సాధారణ వ్యక్తయితే... ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు...రాహుల్ గాంధీ. ఆయన సెలవుపై వెళ్లి సరిగ్గా 54 రోజులవుతోంది. మరి రాహుల్ గాంధీ ఇంతకాలం ఎక్కడికెళ్లినట్లు? ఏం చేస్తున్నట్లు? ఎప్పుడొస్తున్నట్లు? కాంగ్రెస్ లో మునుపెన్నడూ లేదు ఇంతటి ఉత్కంఠ. ఎన్నికల ఫలితాల సందర్భంలో కూడా జయాపజయాలపై ఒక అంచనా ఉండేది. కానీ.. రాహుల్ -రాకపై మాత్రం ఇప్పుడు ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేకుండా పోయాయి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియక సర్వత్రా చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా... పార్టీ నేతలంతా రాహుల్ రాకకోసమే ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో ఫిబ్రవరి 16న రెండు వారాల సెలవు కోరారు...రాహుల్ గాంధీ. ఫిబ్రవరి 23న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత గానీ..ఆయన సెలవుపై వెళ్లిన విషయం బయటకు తెలియలేదు. అంతవరకూ రాహుల్ వెన్నంటి ఉన్న నేతలకు కూడా రాహుల్ వైఖరేంటో? అంతుపట్టడం లేదు.

రాహుల్ ఎక్కడికెళ్లారు? ఏం చేస్తున్నారు? ఎప్పుడొస్తారు?...అని ప్రశ్నిస్తే..ఒక్కొక్కరిది ఒక్కో సమాధానం. నేతల మాటలకు పొంతన లేకుండా పోయింది. ఏఐసీసీ కీలక పదవుల్లో ఉన్న నేతలు కూడా రాహుల్ గాంధీ టూర్ వివరాలు తెలియక తికమకపడుతున్నారు. మీడియా వాళ్లు గుచ్చిగుచ్చి అడుగుతుంటే..అమ్మ సోనియా గాంధీ కూడా...తిరిగొస్తారనే చెప్పారు కానీ, ఎప్పుడొచ్చేదీ స్పష్టం చేయలేకపోయారు.

 

అయితే నెట్ లొ మాత్రం రాహుల్ గాంధీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు?.. ఏం చేస్తున్నారు?.. అని కొన్ని కార్టూన్లు హల్ చల్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ బెర్ముడాలో ఉన్నారా అని, సర్ఫింగ్ చేస్తున్నాడా అని ఓ కార్టూన్ వచ్చింది. రాహుల్ బైక్ పై జోరుగా షికార్ చేస్తున్నారని మరో కార్టూన్. మాస్ జనాల్లో మారు మూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని, ఆల్ఫ్ పర్వతాల్లో స్కిప్పింగ్ చేస్తున్నారని ఇలా రకరకాల కార్టూన్లు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

cartoon-of-rahul-gandhi-1
cartoon-of-rahul-gandhi-2
cartoon-of-rahul-gandhi-3
cartoon-of-rahul-gandhi-4

(Source: Rediff.com)

రాహుల్ సెలవుపై...రాజకీయపక్షాల్లో ఒకటే సెటైర్లు! విపక్షం నుంచే కాదు...స్వపక్షం నుంచీ విమర్శల దాడి పెరిగింది. రాహుల్ గాంధీ..తప్పిపోయిన విమానం లాంటి వారని బీజేపీలో ఓ నేత విమర్శిస్తే...ఆయన వస్తే ఎంత, రాకపోతే ఎంతంటూ... మరోనేత విసుర్లు! ఈ తరహా విమర్శలు, విసుర్లే కాదు..కింది స్థాయిలో నిరసనలు కూడా సాగాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahulgandhi  cartoons  aicc  congress  soniagandhi  leave  

Other Articles