Roja | Scst | Chittur | Daliths

Ysrcp mla roja once more sentences contraversial statements on sc sts at chittur

ysrcp, roja, sc,sts, dharna, chittur, mpp,

ysrcp mla roja once more sentences contraversial statements on sc,sts at chittur. roja in the dharna at chitur mpp office. roja statements on local si, who doing duty at mpp office.

మేమేమీ ఎస్సీఎస్టీలం కాదన్న రోజా.. మండిపడుతున్న దళితసంఘాలు

Posted: 04/11/2015 10:25 AM IST
Ysrcp mla roja once more sentences contraversial statements on sc sts at chittur

ఫైర్ బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా మాటల తూటాలు మరోసారి పేలాయి. నన్ను రేప్ చేసే దమ్ముందా అని రోజా అధికారపక్ష నేతలకు సవాల్ విసిరి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనాన్నే సృష్టించారు. తాజాగా మరోసాని అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు. చిత్తూరు జిల్లా పుత్తూరు ఎంపీపీ మాధవయ్య వైఖరిని నిరసిస్తు ధర్నాకు దిగిన నగరి ఎమ్మెల్యే రోజా  అక్కడే ఉన్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఉద్దేశించి దగ్గరకు రావలసిందిగా రోజా పిలవగా.. ఆయన, అక్కడే నిలబడి ‘చెప్పండి మేడమ్‌’ అన్నారు. దీంతో రోజా ఆగ్రహంగా.. మేమేమీ ఎస్సీ ఎస్టీలం కాదు, దగ్గరకు రండి అన్నారు. ఆ వ్యాఖ్యలు వినగానే.. అక్కడే ఉన్న దళితులు, టీడీపీ నేతలు కోపోద్రిక్తులయ్యారు. ఆమె ప్రసంగానికి అడ్డుతగిలి ‘రోజా డౌన్‌ డౌన్‌, దళిత ద్రోహి రోజా’ అంటూ ఆగ్రహంగా నినాదాలు చేశా రు. ఎంపీడీవో కార్యాలయం నుంచి రోజాను వెళ్లనీయకుండా ఆమె వాహనాన్ని అడ్డుకుని క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై దళితసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితులపై రోజా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాల్లో రోజా దిష్టిబొమ్మలను దహనం చేస్తామని మాలమహానాడుకు చెందిన దళితనాయకుడు కారెం శివాజీ ప్రకటించారు. దళితులపై రోజా చేసిన వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనమనారు. రోజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని శివాజీ డిమాండ్‌ చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలపై తాము నిరసన తెలుపుతామని టీడీపీ దళిత నేత జూపుడి ప్రభాకర్‌ పేర్కొన్నారు. మరి గతంలో చేసిన వ్యాక్యల వేడే ఇంకా తగ్గలేదు మరి ఇప్పటి తాజా వ్యాఖ్యలు ఎంత కాలం వేడిని రేపుతాయో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  roja  sc  sts  dharna  chittur  mpp  

Other Articles