won,t let our lands acquited by proposed bogapuram airport project says farmers

We dont want air port says vizayanagaram district people

vizayanagaram farmers protest, vizayanagaram farmers agitation, proposed bogapuram airport project, 18000 acres of land, vizayanagaram district people, local farmers object bogapuram airport project, agitation at vizayanagaram rdo office, air port, land pooling, 7000 farmers,

we dont want air port says vizayanagaram farmers, won,t let our lands acquited, proposed bogapuram airport project, farmers protest against land acquisition

విజయవాడ టు విజయనగరం.. రాజకున్న ఆందోళనలు..

Posted: 04/10/2015 09:28 PM IST
We dont want air port says vizayanagaram district people

విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అమరావతి నుంచి ప్రారంభమైన ఆందోళన పర్వాలు ఇప్పుడు విజయనగరం జిల్లాకు పాకాయి. రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చే రైతులకు అభివృద్ది చేసిన భూముతో పాటు నష్టపరిహారం కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేయడం, ఇత్యాది తాయిలాలను ప్రకటించడంతో.. కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా.. అనేక గ్రామాల్లో రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రతిపాదిన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాజెక్టును అక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు.

ఇవాళ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ల్యాండ్ పూలింగ్లో తమ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ.. 600 ఏకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మంచ వచ్చునని, కాగా 18 వేల ఏకరాల భూమిని ఎందుకు సేకరిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. పెద్ద సంఖ్యలో దర్నా నిర్వహించిన రైతులు.. విమానాశ్రయం వస్తే జిల్లా బాగుపడదని తమకు నీరు అందిస్తే చాలని వారు అభిప్రాయపడ్డారు.  సుమారు 150 గ్రామాల రైతులు విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. భూముల్ని లాక్కుంటే సహించేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వని ప్రభుత్వం.. నేరుగా అధికారుల బృందాన్ని పంపి భూమిని సర్వే చేయించడాన్ని స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air port  land pooling  7000 farmers  

Other Articles