Bomb | Andhrabank | Tamilnadu

Some unknown persons attcks on andhrabank with bomb at tamilnadu

tamilnadu, ap, police, relly, encounter, chandrababu, thuthukudi, andhrabank, bomb

Some unknown persons attcks on andhrabank with bomb at tamilnadu. In chittur of ap state encounter getting violent angel. yesterday some persons attcked on ap buses and vehicles.

నిరసన కాస్తా హింసాత్మకం.. ఆంధ్రాబ్యాంక్ పై బాంబ్ దాడి

Posted: 04/09/2015 10:22 AM IST
Some unknown persons attcks on andhrabank with bomb at tamilnadu

ఏపిలో తమిళ కూలీల ఎన్ కౌంటర్ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు తెర తీసింది. తమ రాష్ట్రానికి చెందిన కూలీలను కాల్చి చంపుతారా అంటూ తమిలనాట తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. ఇప్పుడు పోలీసులకు ఇదే తీవ్రంగా టెన్షన్ పెడుతోంది. తమిలనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ర్యాలీలు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మల దహనాలు జరిగాయి. అయితే ఆందోళనలు కాస్త తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారుతురన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో తిరుగుతున్న ఏపి వెహికల్స్ పై నిరసన కారులు రాళ్ల దాడి చేశారు. పోలీసులు కూడా పరిస్థితిని అదుపు చెయ్యడంలో విఫలమయ్యారు.

తాజాగా తమిలనాడు ఆందోళనకారులు ఆంధ్రాబ్యాంక్ పై బాంబ్ దాడి చేశరు. రెండు రోజులుగా సాగుతున్న నిరసన నేపథ్యంలో  తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంకుపై ఈ ఉదయం దుండగులు  బాంబు విసిరారు. అయితే ఆ సమయంలో బ్యాంకు ఇంకా తెరవకపోవటంతో ప్రమాదం తప్పింది. అయితే నిరసన హింసాత్మకంగా మారుతోందని ఇప్పటికే నిఘా వర్గాలు తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఏపి, తమిలనాడు రాష్ట్రాల మధ్య రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamilnadu  ap  police  relly  encounter  chandrababu  thuthukudi  andhrabank  bomb  

Other Articles