Tamilnadu | Fire | AP | Enconter

Tamilnadu fires on encounter which place at sheshachalam forest

tamilnadu, ap, chittur, encounter, sheshachalam, forest, redsandal, protest, rally

Tamilnadu fires on encounter which place at sheshachalam forest. protesters took rallys to oppose the enconter. The rally getting violent in tamilnadu. All bus services are cancelled between ap and tamilnadu.

రగులుతున్న తమిళనాడు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

Posted: 04/09/2015 10:44 AM IST
Tamilnadu fires on encounter which place at sheshachalam forest

ఓ ఎన్ కౌంటర్ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. తమ వాని ప్రాణాలను తీసిన ఏపి ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు రాష్ట్రంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, బర్తరఫ్ లు జరుగుతున్నాయి. అయితే నిరసనలు అంతకంతకు ముదిరి హింసాత్మకంగా మారుతున్నాయి. నిన్న తమిళనాట తీవ్ర ఆగ్రహంగా ఉన్న నిరసనకారులు ఆర్టీసీ బస్సులను తగులబెట్టారు. అంతటితో ఊరుకోకుండా ఏపికి చెందిన సంస్థలు, బ్యాంకులు లాంటి వాటిపై దాడులకు దిగుతున్నారు. దాంతో తమిలనాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ఏపికి చెంది అన్ని సంస్థల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

తమిళనాడు మరీ ముఖ్యంగా చెన్నైలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ ఉన్న ఏపికి చెందిన సంస్థల ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. తమిలనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ర్యాలీలు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మల దహనాలు జరిగాయి. అయితే ఆందోళనలు కాస్త తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారుతురన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో తిరుగుతున్న ఏపి వెహికల్స్ పై నిరసన కారులు రాళ్ల దాడి చేశారు తాజాగా తమిలనాడు ఆందోళనకారులు ఆంధ్రాబ్యాంక్ పై బాంబ్ దాడి చేశరు. రెండు రోజులుగా సాగుతున్న నిరసన నేపథ్యంలో  తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంకుపై ఈ ఉదయం దుండగులు  బాంబు విసిరారు. ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే పరిస్థితి అంతకంతకూ అదుపు తప్పుతోంది. తమిళనాడులో మొదలైన నిరసన ఎంతకూ తగ్గడం లేదు. అయితే తమిళనాడు లో ఉంటున్న తెలుగు వారికి కాస్త ఆందోళన మొదలైంది. తెలుగు వారు ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఎలాంటి హింస జరకుండా పోలీసులు గట్టి పహారా ఏర్పాటు చేశారు. అయినా తమిళతంబీలు మాత్రం తగ్గడం లేదు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనే తమిళ కూలీలను ఎన్ కౌంటర్ చేయించాడని తమిళులు ఆరోపిస్తున్నారు. మరో పక్క ఎన్ కౌంటర్ పై వివరణ ఇవ్వాలని మానవ హక్కుల సంఘం ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamilnadu  ap  chittur  encounter  sheshachalam  forest  redsandal  protest  rally  

Other Articles