AP |Tamilnadu | Encounter | Fire

Encounter in chittur getting fire between ap and tamilnadu

ap, tamilnadu, encounter, firing, chittur, rallys, chennai, redsandal,

encounter in chittur getting fire between ap and tamilnadu. trasport system hang on the encounter of 20 personals at sheshachalam forest. tamilnadu govt fire on the encounter. between the ap and tamilnadu boarder getting red.

ఏపిపై కస్సు మంటున్న తమిళ తంబీలు.. రెండు రాష్ట్రాల మధ్య బస్సుల బంద్

Posted: 04/09/2015 09:01 AM IST
Encounter in chittur getting fire between ap and tamilnadu

చిత్తూరు జిల్లా ఎన్ కౌంటర్ తమిల తంబీలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. బూటకపు ఎన్ కౌంటర్ అంటూ ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో నిరసనలు, ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో తమిళ కూలీల ఎన్కౌంటర్ను నిరసనగా ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు సరిహద్దులతోపాటు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతుంది. ఇప్పటికే వేలూరు, తిరువణ్ణమలై జిల్లాలోతమిళవాసులు చేపట్టిన ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. తమిళనాడులోని ఆంధ్రప్రదేశ్కు చెందిన సంస్థలు, బ్యాంకుల ఎదుట ఆందోళనలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి తమిళనాడు వెళ్లవలసిన దాదాపు 200 బస్సులను ఆర్టీసీ డిపోలకే పరిమితం చేసింది.  ఇదిలా ఉండగా ఎన్కౌంటర్లో మృతి చెందిన ఏడు మృతదేహలను ఆంధ్రప్రదేశ్ అధికారులు తమిళనాడుకు అప్పగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకు బస్సులు  నిలిపివేసి నేటికి మూడో రోజుకు చేరుకుంది. ఎన్ కౌంటర్ పట్ల ఏపి ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలొ రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర కూడా నిఘా పెంచింది. అయితే ఏపి కి చెందిన సంస్థల వద్ద మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరి ఈ వాతావరణం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  tamilnadu  encounter  firing  chittur  rallys  chennai  redsandal  

Other Articles