Chandrababu | Ganta | Ayyanapathrudu

Chandrababu naidu took class to minister for their coordination

chandrababu, class, ganta, ayyanpathrudu, vishakapatnam, tdp, leaders

chandrababu naidu took class to minister for their coordination. In the vishakapatnam TDP party meeting ap cm chandrababu naidu sentences about ayyana pathrudu, ganta srinivas, for their coordination and to party leaders.

మంత్రులకు చంద్రబాబు క్లాస్.. పరిస్థితి మార్చుకోవాలని సలహా

Posted: 04/09/2015 08:37 AM IST
Chandrababu naidu took class to minister for their coordination

'కలిసి పనిచేయండి.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించండి.. లేదంటే మీ ఇద్దరి పదవులు పీకుతా, పరిస్థితిని అంతవరకూ తెచ్చుకోరనే భావిస్తున్నాను' సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తన కేబినెట్‌లో పనిచేస్తున్న ఇద్దరు మంత్రుల ఉద్దేశించి చేసిన వాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జిల్లా నుంచి సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస రావులకు కేబినెట్‌లో స్థానం కల్పించారు. అప్పటికే భిన్న ధృవాలుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తమ తీరు మార్చుకోలేదు. ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డెం అనే పరిస్థితిలను జిల్లాలో తీసుకువచ్చారు. పలు సందర్భాలో వీరి మధ్య ఆధిపత్యపోరు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. మధ్యవర్తులు హితోపదేశం చేసినా తీరు మారకపోగా, సాక్షాత్తు అధినేతే జోక్యం చేసుకునేంత వరకూ వచ్చింది.

తాజాగా నగరంలో  నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కూడా ఇదే అంశంపై అధినేత నోరు విప్పాల్సి వచ్చింది. అయితే ఈ సారి అధినేత డాంభికాన్ని ప్రదర్శించి ఊరుకోలేదు. కార్యకర్తల సాక్షిగా ఇద్దరు మంత్రులనూ సూటిగానే హెచ్చరించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని లేదంటే ఇద్దరూ పదవులు కోల్పోతారంటూ కఠినంగానే హెచ్చరించడం  తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించింది. ఒకప్పుడు నాకు మొహమాటాలుండేవి, ఇప్పుడు వాటిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటూనే ఇద్దరూ సమర్ధులన్న ఉద్దేశంతో తాను కేబినెట్‌లో స్థానం కల్పించానని లేదంటే అంటూ ముక్తాయింపునిచ్చారు. ప్రస్తుతం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మంత్రి అయ్యన్న, విశాఖ నియోజకవర్గాన్ని గంటా సమన్వయం చేసుకోవాలని సూచించారు. కతెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అత్యాశాపరులు లేరని, ఒకటి రెండు శాతం మంది కార్యకర్తలు అటువంటి వారున్నప్పటికీ వారికి నచ్చచెప్పి సమన్వయం చేసుకోవాలన్నారు. మీ పరోక్షంలో మీలోమీకు చాడీలు చెప్పే కార్యకర్తలను దూరంగా పెట్టాలని హితవు పలికారు. మీరు ఆదర్శంగా పనిచేస్తే కార్యకర్తలు అదేరీతిలో నడచుకుంటారని అన్నారు. కార్యకర్తలు కోరుకుంటున్న విధంగా వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కొంత సమయాన్ని కేటాయించాలని మంత్రులు అయ్యన్న, గంటాలకు సిఎం చంద్రబాబు సూచించారు.

 

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  class  ganta  ayyanpathrudu  vishakapatnam  tdp  leaders  

Other Articles