Guntur | Accident | POlice

Four members died in an accident at guntur of ap

Guntur, accident, died, thadepalli, kollakonda, four, police

four members died in an accident at guntur of ap. Today early morning a car hit lorry at thadepalli mandal, kollakonda village. IN this incident two members died on the spot, two more deid while tranfering to hospital.

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Posted: 04/09/2015 07:29 AM IST
Four members died in an accident at guntur of ap

గుంటూరు జిల్లా తాడేపల్లిమండలం కొల్లకొండ గ్రామసమీపంలో తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది.  ఈ  సంఘటనలో మహిళసహా నలుగురు వ్యక్తులు మృతిచెందారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇండికా కారు కొల్లకొండ దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు కారు అద్దాలను పగలగొట్టి మృతదేహాలను బయటకు తీశారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guntur  accident  died  thadepalli  kollakonda  four  police  

Other Articles