tence situation in tamilanadu over chitoor encounter | NHRC, | Red sandal wood smugglers

National human rights commission seek report on chittoor encounter

encounter in chitoor district, 20 red sandalwood smugglers killed encounter in chandragiri, tamilnadu smugglers killed in encounter, Ap police and forest department joint operation,, encounter in andhra pradesh, Red sandal wood smugglers killed in encounter, Andhra Pradesh, NHRC, Tamilnadu smugglers, rtc bus, petrol blast, thada, nellore,

national human rights commission seek report on chittoor encounter tense situation in Tamilnadu over encounter

చిత్తూరు ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్సీ సీరియస్.. తమిళనాడులో ఉద్రిక్తత

Posted: 04/07/2015 08:21 PM IST
National human rights commission seek report on chittoor encounter

చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం( ఎన్ హెచ్ ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ అంశాన్ని ఎన్ హెచ్ ఆర్సీ సభ్యుడు జస్టిస్ మురుగేశన్ సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఎన్ కౌంటర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారన్న వాదనలో అర్థం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఈనెల 23న హైదరాబాద్ లో వాదనలు వింటామని మానవ హక్కుల సంఘం తెలిపింది.

కాగా ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా చెన్నైలోని కోయంబేడు అంతర్రాష్ట్ర బస్టాండ్లో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన తొమ్మిది బస్సులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తిరుపతి డిపోకు చెందిన ఆరు బస్సులు, నెల్లూరు డిపోకు చెందిన మూడు బస్సులు దుండగుల దాడిలో ధ్వంసమయ్యాయి. శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన తీరును తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిచాయి. ఏపీ ఆస్తులు, వాహనాలపై దాడులకు దిగుతామంటూ పలు సంస్థలు హెచ్చరించాయి. ఎన్ కౌంటర్ ఘటనపై సీబిఐ చేత విచారణ జరిపించాలని తమిళనాడు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇటు నెల్లూరు జిల్లా తడ పట్టణం సమీపంలోని పూడి వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. బైక్‌పై వెళ్తున్న దుండగులు బస్సుపై పెట్రోల్ బాంబు విసిరి వెళ్లిపోయారు. అయితే, అది బస్సు పక్కన పడటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులు దుండగులను అడ్డుకోగా వారు పరారయ్యారు. ఎన్ కౌంటర్ కు నిరసనగా దుండగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  NHRC  Tamilnadu smugglers  rtc bus  petrol blast  thada  nellore  

Other Articles