UK-based Kundan Sharma Demand My Donation Back From AAP | Arvind Kejriwal

Uk based kundan sharma demand back blue wagon r to arvind kejriwal

Arvind Kejriwal news, Arvind Kejriwal controversy, aap party controversy, aam admi party controversies, Arvind Kejriwal blue wagon r car, kundan sharma wagon r car, UK-based Kundan Sharma, aap party fan kundan sharma

UK-based Kundan Sharma demand back blue Wagon R to Aravind Kejriwal : The man who gave Arvind Kejriwal the blue Wagon R car made famous by the Aam Admi Party chief's travels in it last year, now wants it back. Once an Aam Aadmi Party supporter, UK-based Kundan Sharma says he is now disillusioned.

‘కారు-నగదు తిరిగిచ్చేయండి’.. కేజ్రీకి షాకిచ్చిన విదేశీ అభిమాని

Posted: 04/07/2015 05:29 PM IST
Uk based kundan sharma demand back blue wagon r to arvind kejriwal

గతేడాది ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ప్రస్తుత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్లూ కలర్ లో వున్న వాగన్-ఆర్ కారులో తిరిగిన సంగతి అందరికీ గుర్తుండే వుంటుంది. ప్రస్తుతం ఆయన ఆ కారును కాకుండా ఇన్నోవాను ఉపయోగిస్తున్నారులెండి. ఇంతకీ ఆ బ్లూ కార్ గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే.. నిజానికి కేజ్రీ తిరిగిన ఆ కారు అతనిది కాదు.. బ్రిటన్ లో నిచేస్తున్న ఆప్ వీరాభిమాని కుందర్ శర్మ అప్పట్లో కేజ్రీకి వున్న క్రేజీకి ఫిదా అయి బహుమతిగా ఇచ్చాడు. అయితే.. ఇటీవలే ‘ఆప్’ నేతల మధ్య గొడవలు జరగడంతో అవి అతని మనస్తాపానికి గురిచేశాయి. దీంతో ఇప్పుడు అతడు తన కారుతోపాటు ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కేజ్రీవాల్ కి గట్టి షాక్ ఇచ్చాడు.

blue-Wagon-R

ఆమ్ ఆద్మీ పార్టీకి మొదటి నుంచి మద్దతు ఇచ్చిన కుందన్ శర్మ.. ప్రస్తుతం ఢిల్లీలోనే నివాసముంటున్నాడు. ఇటీవలే ఆ పార్టీలో గొడవలు అగ్గిరాజుకోవడంతో అవి అతడిని బాధించాయి. ఈ నేపథ్యంలోనే అతడు ‘ఆప్’ పై ట్విటర్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ‘10000 అడుగుల దూరం నుంచి ఆప్ పార్టీని చూసినప్పుడు దానికి వీరాభిమానిని అయ్యానని పేర్కొన్న అతడు.. కానీ 10 అడుగుల దగ్గర నుంచి చూస్తే మాత్రం ఆ పార్టీపై ఆశ కోల్పోయాను’ అంటూ మొదట ట్వీట్ చేశాడు. ఇక ఈ క్రమంలోనే తాను బహుమతిగా ఇచ్చిన కారును, తనతో కలిసి తన భార్య డొనేట్ చేసిన నగదును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

UK-based-Kundan-Sharma

ఇక ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇతడు తన నగదు ఇవ్వాలంటూ కోరాడు. ఈ క్రమంలోనే అతడు మాట్లాడుతూ.. నిర్భయ ఘటనపై పార్టీ స్పందన చూసిన తర్వాత కారును డొనేట్ చేసినట్లు తెలిపాడు. జనవరి 1, 2013న కేజ్రీవాల్ తనతో స్వయంగా మాట్లాడారని, 3వ తేదీన తాను ఆ కారును గిఫ్టుగా ఇచ్చానని పేర్కొన్నాడు. అప్పుడు కేజ్రీవాల్ తనని అభినందించి, పార్టీ లెటర్ హెడ్ పై ఒక లేఖ కూడా రాశారని తెలిపాడు. అయితే.. ఇప్పుడు కేజ్రీవాల్ ఇన్నోవా వాహనంలో పర్యటనలు మొదలుపెట్టాకా తానిచ్చిన బ్లూ కార్ ఏమైందంటూ తనని ఎందరో ప్రశ్నించారని తెలిపారు.

ఇదిలావుండగా.. కుందన్ శర్మ అడిగిన డిమాండ్ మేరకు ఆప్ పార్టీ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆ పార్టీ అతడికి కారు, నగదో వెనక్కు తిరిగి ఇస్తుందా..? కేజ్రీవాల్ ఎటువంటి సమాధానం ఇస్తారు..? ఈ విషయంపై ఇంకా వివాదాలు రేగుతాయా..? అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  UK-based Kundan Sharma  blue Wagon R car controversy  

Other Articles