Vishva Hindu Parishad Called Ban On Uttama Villain | Kamal Hassan Controversies

Vishva hindu parishad tamil nadu wing ban on kamal haasan uthama villain

uttama villain news, uttama villain controversy, uttama villain ban news, Vishva Hindu Parishad news, Vishva Hindu Parishad controversy, kamal hassan news, kamal hassan controversy, kamal hassan updates, kamal hassan movies, kamal hassan gossips, uttama villain kamal hassan, ramesh aravind, k balachander, n linguswamy

Vishva Hindu Parishad Tamil Nadu wing ban on Kamal Haasan Uthama Villain : Vishva Hindu Parishad’s (VHP) Tamil Nadu wing has called for a ban on the Kamal Haasan-starrer Uthama Villain. The film, scheduled to hit the screens soon, will affect the religious sentiments of Hindu people, the outfit has claimed.

కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ చిత్రంపై నిషేధం..

Posted: 04/07/2015 01:18 PM IST
Vishva hindu parishad tamil nadu wing ban on kamal haasan uthama villain

లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా నటించిన ‘ఉత్తమ విలన్’ చిత్రంవిడుదలకు ముందే అనేక అవాంతరాలను ఎదుర్కొంటుంది. నిజానికి ఈ చిత్రం ముందుగా అనుకున్నట్లుగా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కావల్సి వుండేది. అయితే.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఇక ఎటువంటి సమస్య లేదని యూనిట్ సభ్యులు భావిస్తుండగా.. ఇంతలోనే ఈ చిత్రంపై నిషేధం విధించాలంటూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) పిలుపునిచ్చింది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆ పరిషత్ హెచ్చరిస్తోంది.

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా వున్న ‘ఉత్తమ విలన్’ చిత్రంలో కొన్ని సన్నివేశాలు హిందూవుల మనోభావాలను కించేపరిచే అవకాశం ఉన్న కారణంగా నిలుపుదల చేయాలంటూ పోలీస్ కమిషనర్ కు వీ.హెచ్.పీ ఓ నివేదికను సమర్పించింది. ముఖ్యంగా.. విష్ణుమూర్తి భక్తుడు ప్రహ్లాదకు, హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి జరిగే సంభాషణ ఆధారంగా ఈ మూవీలో తెరకెక్కిన ఓ పాటలో ఒక పాట విష్ణుమూర్తి భక్తులను నిరాశకు గురి చేస్తుందని వివరించింది. దీంతో ఆ సినిమా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతేకాదు.. ఈ మూవీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టేందుకు వారు ప్రణాళికలు చేస్తున్నట్లు కమీషనర్ కు చెప్పినట్లు తెలుస్తోంది.

మరి.. ఈ విషయంపై ‘ఉత్తమ విలన్’ యూనిట్ సభ్యులు, కమల్ హాసన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలావుండగా.. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ప్రసిద్ధ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కమల్, ఎన్.లింగుస్వామి సంయుక్తంగా నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttama villain ban  kamal hassan  Vishva Hindu Parishad  

Other Articles