Air India cockpit fight | pilot called older co-pilot uncle

Air india cockpit fight pilot called older co pilot uncle

air india cockpit fight, pilots cockpit fight, Air India pilots cockpit fight, captain co pilot cockpit fight, air india aeroplane, air india services, air india controversy, air india cockpit fight controversy

Air India cockpit fight pilot called older co-pilot uncle : Two Air India pilots were derostered on Monday after a scuffle between the two in the cockpit of a plane just before its departure from Jaipur over a minor issue of the captain addressing his deputy as 'uncle'. The incident took place when the plane was readying to take off for Delhi on Sunday evening.

వామ్మో.. ‘అంకుల్’ అని పిలిచినందుకే దాడి?

Posted: 04/07/2015 01:43 PM IST
Air india cockpit fight pilot called older co pilot uncle

ఇటీవలే ఎయిరిండియా విమానంలోని కాక్ పిట్ లో ఇద్దరూ పైలట్లు కొట్టేసుకున్న విషయం తెలిసిందే! జైపూర్ నుంచి ఢిల్లీకి విమానం బయలుదేరడానికి ముందు కాక్ పిట్ లో కెప్టెన్, కో- పైలట్ ఘర్షణ పడిన ఘటన తారా స్థాయికి చేరింది. వారిద్దరూ కాక్ పిట్ ను రణరంగ క్షేత్రంగా మార్చేశారు. జైపూర్ లో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘర్షణ వెనుక కెప్టెన్ ను కో-పైలట్ అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడికి కూడా తెగబడ్డాడని ఎయిర్ లైన్స్ వర్గాలు ఇదివరకే వెల్లడించాయి. కానీ.. ఈ గొడవ జరగడానికి కారణమేంటో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కెప్టెన్ తన కో పైలట్ ను అంకుల్ అని పిలవడం వల్ల అతను కోపాద్రిక్తుడై కెప్టెన్ పై దాడికి దిగాడని తెలిసింది.

విమానం టేక్ ఆఫ్ కు ముందు కెప్టెన్ తన కో-పైలట్ ని అంకుల్ అని పిలిచాడు. సీనియర్ పైలట్ అయిన కెప్టెన్ వయస్సులో తన కో-పైలట్ కంటే యువకుడు కావడంతో  అతడిని అంకుల్ అని ఉచ్చరించాడు. దీంతో కో పైలట్ విభేదించి కెప్టెన్ తో ఘర్షణకు దిగాడు. ‘తనను అంకుల్ అనడానికి నువ్వు ఎవరు?’ అని కో-పైలట్ ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా కెప్టెన్ ను అసభ్య పదజాలంతో దూషించి అతడిపై దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని త్వరలోనే ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని అధికారి ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air India pilots cockpit fight  air india aeroplane controversy  

Other Articles