si siddaiah still critical, treatment continues on ventilator

Suryapet firing si siddaiah health condition critical

SI siddaiah still critical, si siddaiah health condition still critical, SI siddaiah treatment continues on ventilator, SI siddaiah, police comb nalgonda, another suspect moving towards warangal, police searches on for another suspect, nalgonda nazeeruddin baba durga, simi terrorist encounter, simi terrorists shot dead,

SI siddaiah, the injured in suryapet firing inccident, health condition is still critical treatment continues on ventilator says kamineni hospital doctors

విషమంగానే ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్యం.. వెంటిలేటర్ పైనే చికిత్స..

Posted: 04/06/2015 12:02 PM IST
Suryapet firing si siddaiah health condition critical

నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద ఎన్ కౌంటర్ లో త్రీవంగా గాయపడి అస్పత్రిలో చికిత్స పోందుతున్న అత్మకూరు (ఎం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య ఆరోగ్యం మరింత క్షీణించింది. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సిద్ధయ్య ఇంకా అపస్మారకస్థితిలోనే ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

సిద్ధయ్య శరీరం నుంచి మూడు బుల్లెట్లు తొలగించినా, ఇంకా చిన్న మెదడులో ఉండిపోయిన బుల్లెట్ను వెలికితీయాల్సి ఉందని, అయితే ఆయన శరీరం చికిత్సకు స్పందించడం లేదని, ఇంకా మెదడులో రక్తస్రావం జరుగుతుండడంతో ఆరోగ్యం విషమించిందని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితులలో ఆయన చిన్న మెదడులో వున్న బుల్లెట్ను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాలా? లేదా అనే విషయంపై వైద్యులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కాగా అదే ఆస్పత్రిలో ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణిష . ఓ మగబిడ్డకు జన్మించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఐ సిద్ధయ్యతో పాటు పుట్టిన బిడ్డను కూడా చూసేందుకు అనేకమంది తరలి రావటంతో ఆ బాబుకు ఇన్ఫెక్షన్ సోకినట్లు సమాచారం.

 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SI siddaiah  critical condition  kamineni hospital  

Other Articles