Lokesh | Tdp | Skill development

Nara lokesh stated skill development classes at ntr trust bhavan

nara lokesh, lokesh, tdp, ntr, ntr trustbhavan, chandrababu, skill development, hyderabad

nara lokesh stated skill development classes at ntr trust bhavan. tdp party president chandrbabu naidu son nara lokesh started a skill development classes at ntr trust bhavan in hyderabad.

అబ్బా.. లోకేష్ బాబు ఎంత బాగా చెప్పాడో

Posted: 04/06/2015 12:20 PM IST
Nara lokesh stated skill development classes at ntr trust bhavan

ఎప్పుడూ ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేసే లోకేష్ బాబు పార్టీపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా లోకేష్ పరామర్శ యాత్ర చెయ్యనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ క్లాస్ లను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న వివిధ సామాజిక కార్యక్రమాలపై పార్టీ కార్యకర్తలకు వివరించారు. అంతేకాదు పార్టీ ఎంతో మేలు చేస్తోందని ఏకంగా క్లాసులు కూడా తీసుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ క్లాస్ లకు అని వస్తే లోకేష్ బాబు తన స్కిల్ ను చూపించారని కూడా అక్కడికి వచ్చిన వారు మాట్లాడుకున్నారట.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ క్లాస్‌ను నారా లోకేష్  ప్రారంభించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లో ఒక బ్యాచ్‌లో 250 మందికి శిక్షణ ఇవ్వనుందని నారా లోకేష్ తెలిపారు.  ఒక్కో బ్యాచ్‌కు ఆరు వారాల పాటు శిక్షణ ఇస్తామని ఆయన ప్రకటించారు. టీడీపీ కార్యకర్తల పిల్లలకు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని ఆయన అన్నారు. వచ్చే రెండున్నరేళ్లలో తెలంగాణ, ఏపీలోని జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ప్రారంభిస్తామని లోకేష్ ప్రకటించారు.త్వరలో ఇరు రాష్ట్రాల్లో పర్యటించి, చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం చేస్తామని ఆయన తెలిపారు. మొత్తానికి లోకేష్ బాబు గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాల్లో ఎంతో చలాకీగా ఉంటున్నారు. మరి పార్టీలో ఎంత వరకు తనకు మద్దతు కూడగడతారో చూడాలి.

- అబినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  lokesh  tdp  ntr  ntr trustbhavan  chandrababu  skill development  hyderabad  

Other Articles