AAP | Ajaymaken | Delhi | Vip

Aap become vip and vvip party in just 50 days

vip, vvip, culture, aap, kejriwal, delhi, corruption, heplline, ajay maken, congress

The Aam Aadmi Party on Sunday came under sharp criticism form Congress for becoming a ‘party of VIP and VVIPs’. On the 50th day of its government, the AAP relaunched the ‘1031’ anti-graft helpline from the Talkatora Stadium in Central Delhi. However, the party put had put up hoardings of VIP and VVIP parking at many gates of the venue, evoking strong reaction from the Congress.

50 రోజుల్లోనే ఆప్ లో ఎంత మార్పు.. విఐపి లకు ప్రత్యేక గేట్లు..!

Posted: 04/06/2015 10:32 AM IST
Aap become vip and vvip party in just 50 days

విఐపి విధానానికి మేం వ్యతిరేకం అని గొంతుచించుకున్న పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులకే అప్పుడే విఐపి సంసృతిని పాటిస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏంటా అని అనుకుంటున్నారా.. దేశంలో సంచనాలను సృష్టిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ. పార్టీ పాలసీల్లో ఒకటైన విఐపి సంసృతి వ్యతిరేకత ఇచ్చుడు గాలిలో కలిసింది. ఎందుకంటే పార్టీకి చెందిన ప్రముఖులకు, కొంత మంది వివిఐపిల కోసం పార్టీ చేసిన ఏర్పాట్లపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిపై తీవ్రంగా మండిపడ్డ ఆప్ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేకపోతోంది.

ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ ను తాజాగా ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమానానికి పార్టీకి చెందిన వారితో పాటు పలువురు విఐపిలు, వివిఐపిలు కూడా హాజరయ్యారు. అయితే విఐపి సంసృతిని వ్యతిరేకించే ఆప్ పార్టీ విఐపిల కోసం ప్రత్కేకంగా ఎంట్రన్స్ లను ఏర్పాటు చేసింది. వారికి ప్రత్యేకంగా అతిథి మర్యాదలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వారు దీనిపై మండిపడుతున్నారు. అధికారంలోకి రాక ముందు అంతంత మాటలు చెప్పిన వారు ఇప్పుడు ఇలా చేస్తున్నారేంటా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఏకంగా రెండు ఫోటోలను సాక్షంగా చూపిస్తూ, ఆప్ పై కామెంట్ చేస్తు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.

maken-twitter


ఫోటోల్లో చూడండి.. 50 రోజుల్లో పార్టీ ఎలా విఐపి, వివిఐపి పార్టీగా మారిందో చూడండి అంటూ ట్వీట్ చేశాడు. దాంతో అజయ్ మాకెన్ ట్వీట్ పై, ఆప్ వ్యవహారంపై చర్చ సాగుతోంది. మొత్తానికి అధికారంలోకి రాక ముందు ఎన్ని మాటలు చెప్పినా అధికారంలోకి వచ్చాక మాత్రం అధికారం అలా మార్చేస్తుందేమో మరి.. ఆప్ దీనిపై ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vip  vvip  culture  aap  kejriwal  delhi  corruption  heplline  ajay maken  congress  

Other Articles