air India captain deputy spar before flight

Air india co pilot beats up captain inside cockpit

Air India co-pilot beats up captain inside cockpit, air india captain deputy spar before flight, aviation safety concerns, Air India aircraft's cockpit tense scenes, Air India cockpit,

Amid rising aviation safety concerns over pilots' mental health, an Air India aircraft's cockpit witnessed some tense scenes between the captain and his deputy at Jaipur on Sunday evening just before the Airbus A-320 was to take off for Delhi.

ఎయిర్ ఇండియా విమాన కాక్ పిట్ లో.. కొట్టుకున్నారు..

Posted: 04/06/2015 10:00 AM IST
Air india co pilot beats up captain inside cockpit

జర్మన్‌ వింగ్స్ విమానాన్ని కో-పైలట్ లూబిడ్జ్ తన మానసిక రుగ్మతతో 150 మంది ప్రాణాలను బలిగోన్న కిరాతక ఘటన కళ్ల ముందు ఇంకా కదలాడుతుండగానే... ఎయిర్ ఇండియా విమానంలో కూడా రమారమి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం కాక్ పిట్ లో పైలట్లు ఘర్షణ పడిన ఘటన జైపూర్ లో అలస్యంగా వెలుగుచూసింది. జైపూర్ నుంచి ఢిల్లీకి విమానం బయలుదేరడానికి ముందు కాక్ పిట్ లో కెప్టెన్, కో- పైలట్ ఘర్షణ పడ్డారు. కాక్ పిట్ ను రణరంగ క్షేత్రంగా మార్చేశారు. కెప్టెన్ ను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడికి కూడా తెగబడ్డాడు కో-పైలట్. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఇద్దరి మధ్య వాగ్వాదం మాత్రమే చోటుచేసుకుందని, అంతకుమించి ఏం జరగలేదని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి వ్యవహరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా.. మీడియాకు విషయం తెలియడంతో.. యాజమాన్యం మొత్తం ఘటనపై విచారణకు అదేశించారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ పెదవి విప్పడం లేదని సమాచారం. కాగా పైలట్ కో-పైలట్ విమానం బయలుదేరేందుకు ముందు ఘర్షణ పడ్డారన్న సమాచారం తెలియడంతో.. ఆ విమానంలో ప్రయానించిన ప్రయాణికులు హమ్మయ్య మమల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారని వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పైలట్ కో పైలట్ ల మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే.. అది తమ ప్రాణాలతో చెలగాటమాడటమేనని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air India flight  flight pilots spar  

Other Articles