Indonesian currency note with Lord Ganesha Image

Lord ganesha image on indonesias currency

ord ganesha image on indonesias currency, Indonesian currency note with Lord Ganesha Image, Indonesian 20,000 rupiah currency note, Lord Ganesha Image, Indonesian 20,000 rupiah note

Indonesian 20,000 rupiah currency note have the picture of Lord Ganesha

ఇండోనేషియా కరెన్సీ నోటుపై గణనాథుడు

Posted: 04/05/2015 01:18 PM IST
Lord ganesha image on indonesias currency

తొలిపూజలు అందుకుని సిద్ది, బుద్దిలను ప్రసాదించే గణనాధుడు.. ఆలయాలను నుంచి తన మాకం మార్చేసి.. ఇండోనేషియాకు వెళ్లాడు. అదేంటిన అలోచించకండి.. అక్కడకెళ్లిన గణపయ్యను వాళ్లు ఆలయాల్లో దాచుకోవడంతో పాటు.. ఆయనను లక్ష్మీ గణపయ్యగా మార్చేశారు. అర్ధం కాలేదు కదూ.. స్పష్టంగా చెప్పాలంటే.. ఇండోనేషియాలోని అత్యంత అధిక విలువైన కరెన్సీ నోటు పై అయన బొమ్మను ముద్రించారు.  

ఆ దేశం విడుదల చేసిన 20 వేల రూపయా నోటుపై ఒకవైపు గణపతి బొమ్మను,  ఆదేశ స్వాతంత్య్ర పోరాట యోధుడు, అక్కడి విద్యావ్యవస్థకు పునాది వేసిన కిహజర్ దేవాంతరాని బొమ్మను, మరోవైపు విద్యావ్యవస్థను ముద్రించారు. అయితే హిందువులు కేవలం 1.7 శాతం మాత్రమే వున్న ఈ దేశంలో..  అంతర్భాగంగా కొనసాగుతున్న బాలి ద్వీపంలో మాత్రం సుమారు 84 శాతం హిందువులు ఉన్నారు. కాగా ఈ నోటును 1998లోనే ముద్రించినట్లు సమాచారం. కాగా అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు. తాజాగా ఆ నోటుని అమలాపురం ఎస్‌బీఐ బ్రాంచ్ సీనియర్ అసిస్టెంట్‌ ఇవటూరి రవిసుబ్రహ్మణ్యం సేకరించడంతో ఈ విషయం బహిర్గతమైంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indonesia  currency  Lord ganesha  20  000 rupiah  

Other Articles