Policemen | Finished | Gangsters

Police men finish gangstres of suryapet bustand incident

police men finish gangstres of suryapet bustand incident

police men finish gangsters of suryapet bustand incident. police encounter the accuses who open fired on police men at suryapet busstand. police men chase the accuses and find them at janakipuram, open firing on them. two men died and one police man died in this incident. ci and two constables injured.

సూర్యాపేట దుండగుల కథ ముగించారు.. కానీ పోలీసులూ మృతి చెందారు

Posted: 04/04/2015 10:45 AM IST
Police men finish gangstres of suryapet bustand incident

తెలంగాణ లో సంచలనం రేపిన సూర్యాపేట బస్టాండ్ లో కాల్పుల ఘటనలో పోలీసులపై కాల్పులకు తెగబడిన రాత్రి పూట మామూలుగా సోదాలు నిర్వహిస్తుండగా దుండగులు పోలీసులుపైకి కాల్పులు జరిపారు. దుండగుల కథ ముగిసింది. మూడు రోజులుగా దుండగుల కోసం విస్తృతంగా గాలించిన పోలీసులు ఎన్‌కౌంటర్‌లో వారిని మట్టుబెట్టారు. పోలీసులపై కాల్పులు జరిపివది యుపి వాసులుగా పోలీసులు గుర్తించారు.  నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీ పురంలో శనివారం దుండగులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమర్యారు. మృతులు యుపికి చెందిన అస్లాం, అయ్యూబ్ గా గుర్తించారు. ఈ ఘటనలో పోలీసులు-దోపిడీ దొంగల మధ్య ఆరు రౌండ్లు కాల్పులు జరిగినట్లు సమాచారం.

కాగా సూర్యాపేట బస్టాండ్లో కాల్పులకు పాల్పడిన దుండగులకు సంబందించి పోలీసులకు సమాచారం అందింది. అయితే పోలీసుల రాకను గమనించిన దుండగులు అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు.  లింగమల్లు అనే వ్యక్తిని తుపాకీతో బెదిరించి అతని ద్విచక్రవాహనం లాక్కుని పరారయ్యారు. అయితే పోలీసులు వారిని సినీ ఫక్కీలో ఛేజ్ చేశారు. దాంతో జానకీపురం ఇసుక డంప్ల వద్ద పోలీసులకు, దుండగుల మధ్య తీవ్రంగా ఎదురు కాల్పులు జరిగాయి. అయితే పోలీసులు వారిని చాకచక్యంగా మట్టుపెట్టారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, ఆత్మకూరు ఎస్ఐ సిద్ధిఖీ  లు మరణించారు. సూర్యాపేట బస్టాండ్ లో జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించగా, తాజాగా మరో ముగ్గరు పోలీసులు మృత్యువాత పడ్డారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police men finish gangstres of suryapet bustand incident  

Other Articles